ఎవరిలో ఎలాంటి టాలెంట్ దాగి ఉంది అని చెప్పడం చాలా కష్టం అని చెప్పాలి. అందుకే ఎవరిని ఎప్పుడు తక్కువ చేసి చూడ కూడదు అని అంటూ ఉంటారు పెద్దలు. రూపురేఖలను బట్టి మనిషి టాలెంటును అంచనా వేయొద్దు అని సూచిస్తూ ఉంటారు. అయితే కొంత మందిని చూస్తే ఇది నిజమే అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఊహించని రీతిలో వారిలో ఉన్న టాలెంట్ను బయట పెడుతూ ఉంటారు కొంత మంది.


 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.  ప్రస్తుతం నేటి రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదువుతున్న వారు సైతం ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడలేకపోతున్నారు. ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తే కాస్త తడబడుతూ ఉండటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా నేటితరం జనరేషన్ కు చెందిన వాళ్లే ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోతుంటే మొన్నటి తరం జనరేషన్ కు చెందిన బామ్మ మాత్రం ఇంగ్లీషులో ఇరగదీస్తుంది అని చెప్పాలి.


 ఏకంగా జాతిపిత మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతూ ఆయనకు సంబంధించిన అన్ని వివరాలను కూడా గుక్క తిప్పుకోకుండా ఇంగ్లీషులో చెబుతుంది బామ్మ. మహాత్మా గాంధీ ఒక్క గొప్ప వ్యక్తి అని హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మతసామరస్యంతో మెలిగే వారు. ఆయన ఒక సింపుల్ లైఫ్ బ్రతికేవాడు అంటూ ఇలా మహాత్మా గాంధీ గురించి ఎన్నో విషయాలను ఇక ఇంగ్లీషులో చెప్పేసింది బామ్మ. ఈ క్రమంలోని గుక్క తిప్పుకోకుండా బామ్మ ఇంగ్లీష్ లో మాట్లాడుతుండడం చూసి నెటిజెన్లు   అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఈ ముసలావిడ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుని ఉంటుందా అని ఆలోచనలో పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: