సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు తెరమీదకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వీడియోలు కొన్ని నెటిజెన్లు  అందరిని కూడా పగలబడి నవ్వేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. సాధారణంగా ఏటీఎం సెంటర్ లో ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డబ్బులు తీసుకోవాలనుకునే వారు లేదా డబ్బులు వేయాలి అనుకునేవారు వచ్చి పోవడం లాంటివి చూస్తూనే ఉంటాము. ఇలా ఎప్పుడు కస్టమర్స్ తో ఏటీఎం సెంటర్ ఎంతో రద్దీగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఎవరైనా వ్యక్తి ఏటీఎం సెంటర్ కు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు కేవలం ఐదు నిమిషాలలో పని పూర్తి చేసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారూ. ఒకవేళ అతను ఐదు నిమిషాలు పని పూర్తి చేసుకోకపోతే పక్కనే ఉన్న కష్టమర్లు అతన్ని మందలించడం లాంటిది కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి కొన్ని గంటల పాటు ఏటీఎం సెంటర్ దగ్గరే నిలబడి పోయాడు. దీంతో అక్కడున్న కస్టమర్స్ అందరూ వేచి చూసి ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చారు   కానీ అక్కడ జరిగిన విషయం తెలిసి మాత్రం చివరికి నవ్వు ఆపుకోలేకపోయారు అని చెప్పాలి.

 అసలేం జరిగిందంటే.. యూకే లోని తెలుసుకో టెస్కో క్యాష్ పాయింట్ సమీపంలో ఏటీఎం వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అక్కడికి మిగతా కస్టమర్లు వచ్చిన అతను మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు. గంటలు గడిచిపోయాయి. పక్కన కస్టమర్లు అలాగే వేచి చూస్తూ ఉంటారు. ఒక యువకుడు కోపంతో దగ్గరికి వచ్చి ఏంటి ఇక్కడి నుంచి జరగడం లేదు అంటూ అతని భుజం తడతాడు. అయినా అతనిలో మాత్రం చలనం ఉండదు. అనుమానం వచ్చి చూస్తే అది బొమ్మ. దీంతో ఒక్కసారిగా వారంతా పగలబడినవ్వుకున్నారు. ఈ వీడియో ట్విట్టర్ లో చక్కలు కొడుతుండగా అందరిని నవ్వుకునేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: