ఇటీవల కాలంలో అడవుల్లో ఉండే క్రూర మృగాలు  అటు జనాభాసాల్లోకి వస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం చిరుతపులు మాత్రమే జనాభాసాల్లోకి వచ్చి పశువులపై దాడులకు పాల్పడటం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా ఇక అడవులకు సమీప ప్రాంతాలలో నివసించే ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతికారు. అయితే ఇటీవల కాలంలో కేవలం చిరుతపులు మాత్రమే కాదు అటు ఎంతో భయంకరమైన పెద్దపులు కూడా జనావాసాల్లోకి వస్తూ ఎంతోమంది పై దాడి చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.



 ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా అడవికి సమీప ప్రాంతంలో ఉన్న గ్రామాల్లోకి వస్తున్న పులి చివరికి ఎంతో మందిని పొట్ట పెట్టుకుంది. దాదాపు 9 మందిని చంపేస్తుంది. ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులు ఆ పులిని పట్టుకునేందుకు ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే 9 మందిని పొట్టన పెట్టుకున్న పులి చివరికి దారుణమైన చావు చచ్చింది అని చెప్పాలి. ఈ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. చంపారన్ జిల్లాలోని బగహ అనే గ్రామంలో పులి దాడి చేస్తూ అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.  మనిషి రక్తానికి రుచి మరిగిన పులి తొమిది మందిని చంపేసింది.


 ఈ క్రమంలోని స్థానికుల ఫిర్యాదు మేరకు పులిని బంధించేందుకు కొన్ని వారాల నుంచి ఏనుగులతో గాలించిన జాడ కనిపించలేదు. ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులు బీహార్ ప్రభుత్వం అనుమతితో షార్ప్ షూటర్లతో పులిని షూట్ చేసి చంపినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చెక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. అయితే ఇక పులిని చంపడం పట్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాణభయం లేదు అనుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: