ఇటీవల కాలం లో అడవుల్లో జీవించే ఎన్నో జంతువులు అటు జనావాసాల్లోకి కూడా వస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి. కేవలం జంతువులు మాత్రమే కాదు విష సర్పాలు సైతం తరచు జనావాసాల్లోకి వచ్చి బెంబేలెత్తిస్తున్నాయ్. ఇక ఇటీవల కాలం లో అయితే వరదల కారణం గా ఏకంగా భారీ మొసళ్లు సైతం జనావాసాల్లోకి రావడం లాంటి వీడియోలు అందరిని అవాక్కయ్యేలా చేశాయని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఊహించని ఘటన కుటుంబ సభ్యులందరి వెన్నులో పనులకు పుట్టించింది. ఒకవైపు కోడి కూసింది. ఇక తెల్లవారుజాము సమయంలో ఇంట్లో వాళ్ళందరూ కూడా నిద్ర లేచారు.  ఇలాంటి సమయంలోనే ఇంటికి ఆనుకొని ఉన్న బాత్రూంలో ఏవో వింత శబ్దాలు రావడాన్ని గమనించారు కుటుంబ సభ్యులు. దీంతో ఇక బాత్రూంలో ఎం ఉండి ఉంటుందా అని వెళ్లి డోర్ తీసి చూసి ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు.  వెంటనే అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు.


 ఇంతకీ లోపల ఏముందో తెలుసా ఒక భారీ మొసలి. దాదాపు ఆరడుగుల పొడవు ఉంటుంది. గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో కరవా ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ నోటా ఈ నోటపడి ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది. ఈ క్రమంలోనే బాత్రూంలో దూరిన ముసలిని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఎంతో చాకచక్యంగా మొసలిని బంధించారు. సమీపంలో ఉన్న చెరువు నుంచి ఆ మొసలి వచ్చి ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు.  గతంలో  ఇలాంటి తరహా ఘటనలు జరిగినట్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: