సాధారణం గా అడవుల్లో ఉండే జంతువుల జీవన శైలి ఎంతో విచిత్రంగా ఆశ్చర్యకరం గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అడవుల్లో ఉండే క్రూర మృగాలు వేటాడే తీరు ప్రతి ఒక్కరి దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఇటీవల కాలం  లో సోషల్ మీడియా అందరికీ అందుబాటు లోకి వచ్చిన నేపథ్యం లో అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియా లోకి వస్తు వైరల్ గా మారి పోతూనే ఉన్నాయి.


 ఇలా అడవుల్లో ఉండే క్రూర మృగాలు ఏకంగా వేరే జంతువులను వేటాడి చంపడం అందరిని కొన్ని కొన్ని సార్లు భయ పెడుతూ ఉంటుంది.. కానీ మరికొన్ని సార్లు ఇక జంతువులు వేటాడే విధానం అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యం గా పులులు సింహాలు లాంటివి భారీ జంతువులు వేటాడాలి అనుకున్న సమయంలో నక్కినక్కి ఎదురుచూస్తూ చివరికి ఒక్కసారిగా దాడికి పాల్పడుతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు సింహాలు పులులు లాంటి క్రూరముగాలకు ఆహారంగా మారాల్సిన జంతువులు ఎంతో చాకచక్యంగా తప్పించుకోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒక పులి వేటాడటానికి ప్రయత్నించి బ్లూ బక్ అనే జంతువుతో దాగుడుమూతలు ఆడింది అని చెప్పాలి. నీలి జింక తలెత్తి చూసిన సమయానికి కిందకు వంగి కనిపించకుండా దాక్కుంది పులి. ఇక అది గడ్డి మేయడం మొదలుపెట్టగానే మెల్లగా దాని దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించింది. చివరికి ఎలాగోలా పులిని చూసేసిన నీలి జింక అక్కడ నుంచి పరార్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోవడంతో ఎంతో మంది నేటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: