సాధారణంగా ఎంతో మంది పర్యటకులు వివిధ అందమైన ప్రాంతాలకు పర్యటనకు వెళ్లి ఇక అక్కడ కొంత సమయం పాటు గడిపి సంతోష పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రత్యేకమైన గుడారాలను ఏర్పాటు చేసుకొని అక్కడే వంటావార్పు చేసి ఇక ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా విహారయాత్రకు వెళ్లిన ప్రయాణికులకు కొన్ని కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోకి ఇలా విహారయాత్రకు వెళ్తే మాత్రం ఇక అడవుల్లో ఉండే జంతువులు కొన్ని సార్లు దాడి చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.



 మొసళ్ళు  ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఒక పెద్దాయన సరదాగా విహారయాత్రకు వెళ్ళాడు.. ఈ క్రమంలోనే అక్కడే ఏదో తినడానికి వండుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో అక్కడికి ఒక మొసలి ఎంట్ర ఇచ్చింది.. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ఆ పెద్దాయన ఏకంగా  తన చేతిలో పెనంతో ఒక్కసారిగా మొసలి పై దాడి చేయడంతో అది అక్కడి నుంచి పారారయింది. ఈ వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ముఖ్యంగా పబ్జి ప్రియులకు ఎక్కువగా నచ్చేస్తుంది అని చెప్పాలి.


 ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మొసళ్ళు  ఎక్కువగా ఉండే ఓ లేక్ ప్రాంతంలో ఈ పెద్దాయన  విహారయాత్రకు వెళ్ళాడు అన్నది తెలుస్తుంది. ఇలా తనపై దాడి చేయడానికి వచ్చిన మొసలిని మాత్రం విజయవంతంగా తరిమి కొట్టాడు ఆ పెద్దాయన.. ఇంతకీ ఇక ఈ వీడియో పబ్జి ప్రియులకు ఎందుకు నచ్చుతుంది అంటారా.. పబ్జి గేమ్ లో కూడా ఇలా పెనంతో శత్రువులపై దాడి చేయడం వాళ్ళని తరిమి కొట్టడం లేదా చంపేయడం లాంటివి ఉంటాయి. ఇక అందుకే ఈ వీడియో చూడగానే ముసలాయన మొసలితో పబ్జి ఆడాడు అంటూ ఎంతోమంది పబ్జి ప్రియులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: