సాధారణంగా మన మనసుకు ఎవరైనా దగ్గరయ్యారు అంటే చాలు వారిని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని ఇక ముద్దు పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా ఇలాగే ప్రేమను వ్యక్తం చేస్తాయి అన్నదానికి నిదర్శనంగా ఇప్పటివరకు ఎన్నో వీడియోలు వైరల్ గా మారిపోయాయి. ముఖ్యంగా మనుషులకు దగ్గరగా ఉండే కొన్ని జంతువులు అయితే అచ్చం మనుషుల్లాగానే ఆవ భావాలను పలికిస్తాయని కొన్ని వీడియోల ద్వారా అందరికీ ఇప్పటికే అర్థమైంది అని చెప్పాలి.


 ఇలా మనుషుల్లాగానే హవ భావాలు పలికించే జంతువులలో అటు ఏనుగులు కూడా ఉన్నాయి. ఏకంగా మనుషులకు దగ్గరగా ఉండే ఏనుగులు మనుషులపై చూపించే ప్రేమ వర్ణనాతీతంగా ఉంటుంది. చూడ్డానికి భారీ ఏనుగులు అయినప్పటికీ మనుషుల్లో మనుషుల్లాగా కలిసిపోతూ ఉంటాయి. ఏకంగా తన యజమాని పట్ల ఏనుగులు చూపించే ప్రేమకు చూసి నేటిజన్లు సైతం ఆశ్చర్యపోవడం కొన్ని కొన్ని సార్లు జరుగుతూ ఉంటుంది.. ఇక ఇక్కడ ఇలాంటి తరహా ఘటనకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ఏకంగా ఒక ఏనుగు పిల్ల తనకు విపరీతంగా నచ్చిన వ్యక్తిపై ముద్దుల వర్షం కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. అయితే అతను ఆ ఏనుగుని వదిలించుకోవాలని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ గున్న ఏనుగు మాత్రం ఇక ప్రేమగా ముద్దులు పెడుతూనే ఉండడం గమనార్హం. ఇక ఈ వీడియో కాస్త నవ్వులు పూయిస్తుంది అని చెప్పాలి. ఇటీవల ఒక వ్యక్తి ఏనుగుల సంరక్షణశాలకు వెళ్లగా అక్కడ షెడ్డులో పెద్ద ఏనుగుతోపాటు పిల్ల ఏనుగు కూడా ఉంది.దానిని చూసి అతను ముచ్చట పడ్డాడు. తల నిమురుతు ప్రేమను పంచాడు. అయితే గున్న ఏనుగు అతను చూపిన ప్రేమకు ఫిదా అయిపోయింది. వెంటనే చిన్న తొండంతో అతను చుట్టేసింది ఇక ముఖం అంతా నిములతో ముద్దులు పెట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: