దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు శత్రు దేశాల నుంచి దేశానికి రక్షణ కల్పిస్తూ ఉంటే ఇక దేశం నడిబొట్టులో ఉన్న జనాలు హాయిగా గుండెపై చేయి వేసుకొని పడుకుంటున్నారు అంటే అందుకు ఖాకిలే కారణం అని చెప్పాలి. పోలీసులు ఉన్నారు ఇక నేరాలను అరికడతారు అనే నమ్మకంతోనే ప్రతి ఒక్కరూ బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే కొంతమంది ఖాకీలు పోలీసు వృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం ఏకంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటారు అని చెప్పాలి.


 ఇక మరి కొంతమంది పోలీసులు అటు నేరాలను అరికట్టడం విషయంలో ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ నేరస్తులను పట్టుకోవడం లాంటి ఘటనలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఒక పోలీస్  డ్యూటీలో చూపించిన తెగువను చూసి ప్రస్తుతం నేటిజెన్లు అందరూ కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.


 ఢిల్లీలో సత్యేంద్ర అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల షాబాద్ డైరీ పోలీస్ స్టేషన్ పరిధి లో ఓ మహిళ మెడలోని గొలుసును చోరీకి గురైందని సమాచారం అందుకున్నాడు ఈ కానిస్టేబుల్. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ఇక అతనికి ఎదురుగా ఒక దొంగ మరో ద్విచక్ర వాహనంపై పారిపోతు కనిపించాడు. దీంతో ఎంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. సదురు కానిస్టేబుల్ ఏకంగా ద్విచక్ర వాహనంతో దొంగ బైక్ ని అడ్డగించి ఎంతో సాహసం చేసి మరి ఆ దొంగను పట్టుకున్నాడు. ఇక అతను పట్టుకుంది మామూలు చైన్ స్నాచర్ ను కాదట. అతనికి చాలానే నేరచరిత్ర ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: