సాధారణంగా పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు ఇక ఏకంగా సింహాలు పులులు ఉండే సఫారీలలో తిరుగుతూ ఇక వాటిని దగ్గర నుంచి వీడియోలు తీయడం చేస్తూ ఉంటారు. ఈ  క్రమంలోనే ఇలాంటి క్రూరమైన జంతువులు వేటాడే విధానం వాటి జీవనశైలి కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.. దీంతో నేరుగా ఎలాగో సింహాలను చూడలేం కాబట్టి కనీసం వీడియోలలో అయినా చూద్దాం అన్నట్లుగా అందరూ ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు.


 ఇకపోతే ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలలో సింహాలు పులులను చూడటానికి ఇష్టపడతారు. కానీ ఇక నేరుగా ఏకంగా సింహాల ముందుకు వెళ్లి నిలబడటం అంటే ఆ ఆలోచన వస్తేనే ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత భయం వేస్తూ ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఏకంగా భారీ సింహాల ముందు హాయిగా నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు క్రూరమైన సింహాల ముందు యువకుడు నిలబడటం ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో కనిపిస్తున్నాయి.


 ఇక ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. సాధారణంగా సింహాలు కనిపిస్తే ఎవరైనా పారిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం చేతిలో ఒక చిన్న కర్ర పట్టుకుని సింహాలు పొలంలో నడుస్తూ ఉండగా వాటి ముందు నిలబడి ఎలాంటి భయం  లేకుండా కనిపించాడు. ఏకంగా అక్కడ ఏదో తన ముందు పెంపుడు కుక్కలు ఉన్నాయి అన్నట్లుగానే హాయిగా నిలబడి ఫోన్ వాడుతూ ఉన్నాడు ఆ యువకుడు. ఇది చూసి నేటిజన్స్ అందరు షాక్ అవుతున్నారు. నీ ధైర్యం తగలెయ్యే ఇంత రిస్క్ అవసరమా బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: