సాధారణంగా పాములకు సంబంధించిన వీడియోలు ఏవైనా సోషల్ మీడియాలోకి వచ్చాయి అంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  ఎందుకంటే ప్రత్యక్షంగా పాములు చూసేందుకు భయపడే జనాలు అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోలు చూడడానికి మాత్రం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషపూరితమైన పాములు ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా మొదటి స్థానంలో ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే దీని విషం ప్రమాదకరమైనది మాత్రమే కాదు.. ఇక దీని రూపం కూడా అంతే భయంకరంగా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియో ఏది వచ్చిన కూడా అది సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటుంది. ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒకే బిలంలో ఆరు కింగ్ కోబ్రాలు బయటపడిన వీడియో అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. భారీ ఆకారంతో ఉన్న ఈ కింగ్ కోబ్రాలను సదరు వ్యక్తి ఎంతో సునాయాసంగా పట్టుకున్నాడు. ఈ వీడియోలో చూసుకుంటే మొదట ఒక స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు పోయి పాముకాటుకు గురవుతాడు. ఇక అతను కాలు పట్టుకొని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మరో ఇద్దరు స్నేక్ క్యాచర్లు వెంటనే అక్కడ ఉన్న పాములను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏకంగా ఒకే బిలంలో ఆరు కింగ్ కోబ్రాలను గుర్తించి వాటిని ఎంతో చాకచక్యంగా పట్టుకుని సంచిలో వేస్తారు. అయితే ఎలాంటి రక్షణ లేకపోయినప్పటికీ కింగ్ కోబ్రాలను పట్టుకోవడానికి ఆ స్నేక్ క్యాచర్లు ఎక్కడ భయపడలేదు అని చెప్పాలి. ఇక ఇలా ఒకేచోట ఆరు కింగ్ కోబ్రాలు బయటపడటంతో అందరూ ఇది చూసి షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: