సాధారణంగా అడవుల్లో సంచరించే తోడేళ్లు ఎలా ఉంటాయి అన్న విషయంపై దాదాపు అందరికీ అవగాహన ఉంటుంది. అయితే అందరూ నేరుగా చూడకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోల ద్వారా లేదంటే టీవీలో యానిమల్ ప్లానెట్ అనే ఛానల్ ద్వారా ఇక ఇలా తోడేల్ల రూపురేఖలు ఎలా ఉంటాయి అని చూసే ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఇలా సోషల్ మీడియాలో ఎక్కడైనా ఏదైనా వీడియో ప్రత్యక్షమైంది అంటే చాలు అందులో ఉంది తోడేలే అన్న విషయం టక్కున గుర్తుపట్టేస్తూ ఉంటారు.  కానీ ఇక్కడ ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూస్తూ ఉంటే అక్కడ ఉంది అసలు తోడేలేనా అనే అనుమానం అందరికీ కలుగుతుంది అని చెప్పాలి.


 ఎందుకంటే ఇటీవలే వైరల్ గా మారిపోయిన వీడియోలో రోడ్డు దాటుతున్న జీవి చూడ్డానికి తోడేలు ఆకారంతో ఉన్నప్పటికీ.. దాని సైజు మాత్రం కాస్త నక్క లాగే ఉంది అని చెప్పాలి. ఇక ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ కనిపించే జీవి. దీని పేరు మైన్డ్ వుల్ఫ్ అని అంటారు. ఇవి తోడేళ్లే కానీ చూడ్డానికి కాస్త నక్కలా ఉంటాయి. కాగా ఎరుపు గోధుమ రంగు బొచ్చు చాలా పొడవైన నల్లటి కాళ్లు నక్కలాంటి తలతో ఈ తోడేలు ఉంటుంది. ఇక రాత్రిపూట ఈ తోడేలు ఒంటరిగా తిరుగుతూ ఉంటుందట. ఇక చిన్న చిన్న జంతువులు కీటకాలు మొక్కల పదార్థాలను తింటూ ఈ తోడేలు జీవిస్తూ వుంటుందట.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోవడంతో ఇది చూసిన ఎంతో మంది నెటిజెన్స్  షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఇలా ఈ వీడియో చూసిన నేటిజన్స్ అందరూ అక్కడ కనిపించేది తోడేలా లేకపోతే నక్క అని కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. ఎందుకంటే మొదటి చూపులోనే తోడేలుగా కనిపించిన ఆ జంతువు ఇక ఆ తర్వాత కాస్త దగ్గరగా చూస్తే నక్క ఆకారంలో కనిపిస్తుంది. అయితే కొంతమంది నేటిజన్స్ ఇది హైనా అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మధ్య దక్షిణ అమెరికాలోని మారుమూల మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా కుక్కల కుటుంబానికి చెందిన ఈ అరుదైన పెద్ద చెవుల తోడేళ్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: