ఎప్పటి రాగానే ఇక రోడ్డు మొత్తం వాహనాల రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే రోడ్డు పక్కన ఉన్న కాలువ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అయితే మొదట శబ్దాలు చిన్నగా రావడంతో ఇక వాహనదారులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ శబ్దాలు ఎక్కువ కావడంతో అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకోవాలని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కోజీ కోడ్ లో కొండచిలువలు కలకలం సృష్టించాయి.
స్థానిక కరప రంబ శివారు ప్రాంతం లోని కానోలి కాలువ లో ఆరు కొండ చిలువలు ప్రత్యక్షం కావడంతో ఇది చూసి స్థానికులందరూ భయాందోళనకు గురయ్యారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులకు వింత శబ్దాలు వినిపించడంతో ఏంటా అని రోడ్డుపక్కన ఉన్న కాలువలో చూసి ఒక్కసారిగా కంగుతున్నారు. దీంతో ఇక అక్కడ భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది అని చెప్పాలి. ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని కొండచిలువలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇకపోతే ఆహారాన్ని వెతుక్కుంటూ కొండచిలువలు అడవి నుంచి బయటకు వచ్చాయని అధికారులు అంచనా వేశారు. ఇక వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.