సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా ఇంటర్నెట్లోకి వచ్చిన వీడియోలు కొన్ని ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఇక జంతువులకి మనుషులకు మధ్య ఉన్న సంబంధాలు ఎలాంటివి అన్న విషయాన్ని తెలియజేసేలా మరికొన్ని వీడియోలు ఉంటాయి అని చెప్పాలి.


 అయితే ఇక ఇలా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వీడియోలలో కొన్ని అందరికీ నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ ఓ ఫన్నీ వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్స్ అందరు కూడా తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. సాధారణంగా ఉడతలు ఏకంగా మనుషుల దగ్గరికి వచ్చి ఆడుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో ఒక చిన్నారితో ఉడతా సరదాగా ఆడుకుంటూ ఉండటం కనిపిస్తూ ఉంది అని చెప్పాలి..


 ఇలా ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే.. తెల్లటి ఓవర్ కోట్, బ్లాక్ పాయింట్ షూస్ మరియు క్యాప్ పెట్టుకొని ఒక చిన్నారి రోడ్డుపైకి వచ్చింది. అయితే కాసింత  దూరం లోనే ఆ చిన్నారి తల్లి  దండ్రులు కూడా ఉండడం గమనార్హం. ఇంత లో రోడ్డు పక్క నుంచి ఒక నల్లటి ఉడత ఆ చిన్నారి దగ్గరికి వచ్చింది. అయితే ఉడుతను చూసి చిన్నారి భయపడ లేదు. ఏకంగా దగ్గరికి తీసుకుంది. ఈ క్రమం  లోనే మెల్లిగా ఆ చిన్నారి డ్రెస్ పైనకి ఎక్కిన ఉడత ఒకసారిగా చిన్నారి వేలిని కొరికి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో చిన్నారి ఒక్కసారిగా నవ్వుకుంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: