ఇటీవల కాలంలో ఎంతోమంది మనుషులు మృత్యువాత పడుతున్న తీరు ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణాలపై తీపిని మరింత పెంచేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉన్నవారు.. ఎక్కువకాలం బ్రతికేందుకు అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచించేవారు. అంతేకాదు  ఇక మంచి పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని పదలంగా ఉంచుకునేవారు ఇక అన్ని రకాల వ్యాధులకు దూరంగా ఉంటారని వైద్యులు సూచిస్తూ ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మనిషి ప్రాణాలు ఎప్పుడు తీసేస్తాడు అన్నది ఆ దేవుడు చేతుల్లోనే ఉంటుంది అన్నది అర్థమవుతుంది.


 ఎందుకంటే ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఫిట్గా ఉన్నవారు.. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకున్న వారు సైతం.. ఒక్కసారిగా గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయి రెప్పపాటు కాలంలో ప్రాణాలు వదులుతున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్నాయి. అయితే మొన్నటికి మొన్న వ్యాయామశాలలో వర్కౌట్లు చేస్తూ ఒక డాక్టర్ మృత్యువాత పడిన ఘటన గురించి మరవక ముందే ఇక ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.


 అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా ముగ్గురు స్నేహితులతో కలిసి బ్యాట్మెంటన్ ఆడిన ఒక వ్యక్తి ఇక రెప్పపాటు కాలంలో కుప్పకూలిపోయి మరణించాడు.ఈ ఘటన మస్కట్లో వెలుగులోకి వచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోయింది. నలుగురు స్నేహితులు కలిసి బ్యాట్మెంటన్ ఆడుతున్నారు.  అయితే అప్పటివరకు స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా బ్యాట్మెంటన్ ఆడాడు సదరు వ్యక్తి. చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కూడా కనిపించాడు. కానీ రెప్పపాటు కాలంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో స్నేహితులకు అర్థం కాలేదు. అతను లేవకపోవడంతో ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు సూచించారు. అతని స్నేహితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి: