ముందుగా ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, ఆ తరువాత  మనవూరి పాండవులు సహా మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలతో ముందుకు సాగారు. ఆ తరువాత అక్కడక్కడా సినిమాల్లో విలన్ పాత్రలతో పాటు సపోర్టింగ్ పాత్రల్లోనూ మెరిసిన చిరంజీవి, తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల్లో మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తరువాత మెల్లగా హీరోగా తన సినీ ప్రయాణాన్ని ఆరంభించిన చిరంజీవి కి 1983లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి హీరోగా ఆయనకు అత్యద్భుతమైన ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత నుండి హీరోగా ఆయనకు అవకాశాలు క్యూ కట్టాయి. 

IHG

ఆపై హీరోగా నటించిన ఒక్కో సినిమాతో ఎంతో గొప్ప పేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తూ ముందుకు సాగిన చిరంజీవి, తన నటనతో పాటు తనలోని అద్భుతమైన డ్యాన్సింగ్ టాలెంట్ ని కూడా తెరపై ప్రదర్శించేవారు. ఆ తరువాత నుండి యువత అందరూ కూడా చిరంజీవి డ్యాన్స్ ల పై ఎంతో మోజుపడేవారు. ఇక అక్కడి నుండి ఎంతో ఉన్నత స్థానాలకు ఎదుగుతూ ముందుకు సాగిన చిరంజీవి మూవీ కెరీర్లో అత్యద్భుతమైన విజయాలు ఆయనను సుప్రీం హీరో ని, ఆపై మెగాస్టార్ ని చేసాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారి తరువాత అంతటి ప్రభంజనాన్ని టాలీవుడ్ లో సంపాదించిన హీరో చిరంజీవి అని చెప్పకతప్పదు. ఒకానొక సమయంలో కొంత అపజయాలతో సతమతం అయిన చిరంజీవి, అప్పట్లో రెండేళ్ల గ్యాప్ అనంతరం 1997లో హిట్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తరువాత 2007వ ఏడాదిలో హీరోగా సినిమాలకు విరామం పలికిన చిరంజీవి, రాజకీయాల్లో చేరి ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించి అప్పటి ఎన్నికల్లో తిరుపతి తరపున పోటీ చేసి ఎమ్యెల్యేగా గెలిచినప్పటికీ పార్టీ మాత్రం ఓడిపోయింది. 

IHG' Blog

ఆ తరువాత కొన్నాళ్ళకు తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి, ఆపై కాంగ్రెస్ లో చేరారు. ఇక ఇటీవల మళ్ళి 2017 లో, అంటే సరిగ్గా 10 ఏళ్ళ తరువాత మళ్ళి ముఖానికి మేకప్ వేసుకుని ఖైదీ నెంబర్ 150 సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి హిట్ కొట్టడంతో, కెరీర్ పరంగా గ్యాప్ వచ్చినప్పటికీ తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఆయన నిరూపించుకున్నారు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్, తరచూ ఎన్నో సేవాకార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పేరుతో సంస్థలు స్థాపించి ఎందరికో కొత్త జీవితాన్ని ఇస్తున్న మెగాస్టార్, ఇటీవల కరోనా వ్యాధి నేపథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో తాను సహా పలువురు సినిమా ప్రముఖుల నుండి విరాళాలు సేకరించి ఎందరో రోజువారీ సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఈ విధంగా ఓవైపు నటుడిగా, మరోవైపు మానవత్వం గల గొప్ప వ్యక్తిగా మంచి పేరుతో దూసుకెళ్తున్న చిరంజీవి నిజంగా టాలీవుడ్ లెజెండ్ అని అనకతప్పదు...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: