ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ఏడాది కాలంలోనే అనేకమైన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు సాక్షాత్తు ప్రత్యక్ష దైవం గా నిలుస్తున్నారు. ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే దాన్ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిందని. టాక్స్ నుండి వచ్చే ఆదాయం, మరే ఇతర మార్గాల నుండి పైసా కూడా రాకపోయినా సంక్షేమ పథకాలు అలాగే కొనసాగించి అందర్నీ ఆశ్చర్యపరిచారు జగన్. కరోనా వైరస్ నియంత్రణలో భారతదేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపాదించిదంటే ఆ క్రెడిట్ మొత్తం ఒక్క జగన్ కే దక్కుతుంది.ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తమ కుటుంబం లాగా భావించి ఏ రాష్ట్రం నిర్వహించని స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహించి ప్రతి ఒక్కరి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ చూపించారు జగన్.
ఈ కరోనా మహమ్మారి విపత్కర సమయంలో పేదలకు అండగా నిలుస్తూ అందరి మన్ననలను పొందారు. నాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల ఆరోగ్యం నిమిత్తం 108 అంబులెన్సులను ఏర్పాటు చేస్తే... నేడు జగన్మోహన్ రెడ్డి వాటికి ప్రాణం పోసి ప్రతి ఒక్క వ్యక్తికి చికిత్స క్షణాల్లో అందించడానికి మరెన్నో అత్యాధునిక 104, 108 అంబులెన్స్ లని ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాలు మినహాయించి ఇంకా ఎన్నో రంగాలలో లెక్కలేనన్ని విప్లవాత్మక పథకాలను చేపట్టి ప్రజల హృదయాల్లో కొండంత ధైర్యాన్ని సంతోషాన్ని నింపారు.

ప్రతి వారం ఏదో ఒక అద్భుతమైన పథకానికి శ్రీకారం చుడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరాలు కురిపిస్తున్న జగన్ గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోగులు తమ చికిత్సకు ఆస్పత్రిలో మెడికల్ బిల్లు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చని జగన్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లక్షల మంది ప్రాణాలు కాపాడిన 104, 108 డ్రైవర్లకు, ఎమర్జెన్సీ టెక్నీషియన్లకు జీతాలు కూడా పెంచారు. ఒక అద్భుతమైన ప్రణాళికతో ముందుకు కొనసాగుతున్న యంగ్ అండ్ డైనమిక్ జగన్ దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉత్తమ ముఖ్యమంత్రి లలో నాలుగవ స్థానాన్ని సంపాదించారంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.
జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో చిన్న సన్నకారు రైతులకు ఉచిత బోర్లు ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే ఇటీవల చిన్న సన్నకారు రైతులకు 'వైఎస్సార్ రైతు భరోసా పేరిట' ఉచిత బోర్లు వేయించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసి మాట తప్పను మడమ తిప్పను అనే తన నాన్నగారి నినాదాన్ని ఆచరణలో పెట్టి వాహ్వా అనిపించారు. చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలను కూడా ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ ప్రకటించారు. వారు వారి కాళ్లపై నిలబడేందుకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఏదేమైనా నిజమైన నిజాయితీగల నాయకుడు, ప్రజల విజేత, అందరి విజేత ఎవరని ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఉదాహరణగా చూపించవచ్చు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: