ప్రతి చోట, ప్రతి వారిలో నిర్లక్ష్యం. ఇది ఎంతలా నాటుకుపోయిందంటే చెప్పలేనంతగా, ఇప్పుడున్న బిజీ జీవితంలో కాసేపు ఆలోచించి పని చేయడం మరచిపోయారు మనుషులు, అంతా హడావుడినే. ఈ హాడావుడి ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా మారుతుందో, నిత్యం ఏదో ఒక్క చోట జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ప్రతివారు ఎంతగానో ఇష్టపడే వారి పిల్లల విషయంలో కూడా ఇదే పద్దతిని కొనసాగిస్తున్నారనడానికి ఇక్కడ మనం చూడబోయే సంఘటనే ఉదాహరణ..

 

 

ఇకపోతే పొద్దున లేస్తే పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లాలనే హడావుడి. లేదా ఫ్యామిలీతో బయటకు వెళ్లినప్పుడు కూడా ఎవరో తరుముతున్నట్లుగా వాహనాన్ని వేగంగా నడపడం. తర్వాత ప్రమాదాల బారినపడటం. ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు ఎన్ని జరుగుతున్న మానవుని ఆలోచనల్లో మార్పు రావడం లేదు.  ఇకపోతే చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే. వారి పిల్లలను బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చోబెట్టుకుని ప్రయాణం చేస్తారు. ఒక వేళ నిదుర వస్తే అలాగే ట్యాంక్ పై పడుకుంటారు కూడా. ఇదే కాకుండా స్కూటీ లాంటివి నడిపేటప్పుడు ముందు నిల్చోపెట్టుకుని వేగంగా వెళ్లుతుంటారు.. 

 

 

కొంతమంది అసలు పిల్లలు బండి ఎక్కారోలేదో అని కూడా చూసుకోరు. ఏం ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తారో తెలియదు. అలా వెళ్లిపోతూనే ఉంటారు. మరి కొంతమంది  తమ బైక్ మీద పిల్లలు ఉన్నారనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా డ్రైవింగ్ చేస్తూ బండి నడుపుతారు. ఇకపోతే ఓ తల్లి  నిర్లక్ష్యం వల్ల తన పసిబిడ్డ ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ కెమరాలో రికార్డ్ అయ్యింది. ఈ సంఘటనను చూస్తే పిల్లలు మన వెంట ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుందనిపిస్తుంది.

 

 

ఇక్కడ ఓ తల్లి తన బండి స్టార్ట్ చేసి పెట్టుకుని పిల్లాడిని ఎక్కించుకుంటుంది. అంతలోనే ఏం జరిగిందో తెలియదు గాని ఆ తల్లి తన పిల్లాడు పూర్తిగా ఎక్కక ముందే బండిని ముందుకు పోనిచ్చింది. ఇది అనుకోకుండా జరిగిందా, లేదా ఆ పిల్లాడు ఎక్స్ లేటర్ ఉన్న వైపునుండి ఎక్కేటప్పుడు జరిగిన పొరబాటో తెలియదు గాని చూస్తుండగానే కళ్లముందు పిల్లాడు విగత జీవిగా మారిపోయాడు. హృదయాన్ని కలిచివేసేలా ఉన్న ఈ ప్రమాదకర సంఘటన నిజంగా చూసిన వారి కంట నీరు పెట్టిస్తుంది. అప్పటి వరకు ముద్దులొలుకుతు మాట్లాడిన ఆ పిల్లవాడు అంతలోనే శవంగా మారడం ఇది ఎవరు చేసిన పాపం. ఇప్పుడు ఈ వీడియో చిన్నపిల్లలున్న తల్లిదండ్రులనే కాదు బండి నడిపే ప్రతివారిని ఆలోచింపచేసేలా ఉంది.. అదేంటో మీరు చూడండి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: