కొన్ని కొన్ని సినిమాల్లో దొంగతనం చేసే సీన్లు వస్తుంటే అంత పెద్ద తెరపై ఆ చేజింగ్ ఘట్టాలు చూసే ప్రేక్షకుడికి కలిగే ఎగ్జైటింగ్ మాటల్లో చెప్పలేము. ఆ సమయంలో రోమాలన్ని నిక్కపొడిపించుకుని మరి ఆ సీన్స్‌ను ఆస్వాధిస్తుంటాడు ప్రేక్షకుడు.  మరి ఇదే సీన్ నిజ జీవితంలో తన కళ్లముందు కదిలితే, చెడ్దిలో నుండి చుచ్చు పోసుకుంటారు. గుండెనొప్పి ఉన్న వారైతే అక్కడికక్కడే కూలిపోతారు.

 

 

ఇదంతా ఒకెత్తైతే కళ్ల ముందు ఏదైన దొంగతనాలు జరుగుతుంటే ఆ ప్రదేశంలో ఏర్పడే భయానక దృశ్యాలు ఊహించుకుంటే ఎలా ఉంటాయో...  విచక్షణ కోల్పోయి ఉన్న దొంగలు, అడ్దుగా వెళ్లితే ఎవరి ప్రాణాలు తీస్తారో అన్న టెన్షన్ ఒక వైపు, కళ్ల ముందు జరుగుతున్న దారుణాన్ని ఆపలేక పోతున్నామనే ఆలోచన ఒకవైపు కలుగుతున్న ఆపలేని పరిస్దితి. ఇలాంటి సందర్భంలో ఎంతటి ధైర్యవంతుడైనా కాస్త వెనకడుగు వేస్తాడు. ఇకపోతే అచ్చం సినిమాల్లో చూపించినట్లుగానే ఒక దొంగతనం జరిగింది. ఇలాంటి దొంగతనాలు, అక్కినేని నాగార్జున సూపర్ సినిమాలో చేసాడు. కిక్ సినిమాలో రవితేజ చేసాడు. ఇప్పుడు కాపీ టూ కాపీగా జరిగిన ఈ దొంగతనం పశ్చిమ లండన్‌లోని షెపర్డ్స్ బుష్‌లో జరిగింది..

 

 

రేంజ్ రోవర్ కారుతో జ్యువెలరీ షాపులోకి దూసుకెళ్లిన దొంగలు రెచ్చిపోయారు... అక్కడ ఆభరణాలు ఉంచే గాజు షోకేసులను సుత్తులతో ధ్వంసం చేసి, ఆ నగలను సంచుల్లో వేసుకుని ఉడాయించారు. ఇకపోతే షాపులో కస్టమర్లు అందరు ఉండగానే ఈ దోపిడీకి పాల్పడటం గమనార్హం. కొందరు షాపు బయట నుంచి దొంగలను ఎదుర్కోడానికి ప్రయత్నించగా, వాళ్లు షాపులోని మరో అద్దాన్ని పగలగొట్టి బయటకు పరుగులు పెట్టారు.

 

 

అయితే వారు చేసిన తప్పల్లా కారును అక్కడే వదిలేయడం.. దీంతో పోలీసులు దొంగలను వెంటనే అదుపులోకి తీసుకో గలిగారు. ఇక ఈ కేసులో బెన్ వెగనార్ అనే నిందితుడిని, అతడి గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: