జంతువులతో ఆడుకోవడం కొందరికి సరదాగా ఉంటుంది. ముఖ్యంగా కుక్క పిల్లలతో, కోతులతో, ఆడుకునే వారిని చూస్తుంటే తెగముచ్చట వేస్తుంది. మరికొన్ని దేశాల్లో పాములను పక్కలో కూడా పడుకో పెట్టుకుంటారు. పాములే కాదు కుక్కలను కూడా అతిగారాభం చేస్తారు.. కాని ఎంత ప్రేమగా చూసుకున్న అవి జంతువులే కదా..! మనిషిలా ఆలోచించలేవు. వాటికి తోచింది చేస్తూ అప్పుడప్పుడు విధ్వంసాన్ని కూడా సృష్టిస్తాయి..

 

 

అందుకే మూగజీవాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రాణంగా చూసుకునే ఈ మూగజీవాల వల్ల కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కూడ పోయిన సంఘటనలు ఉన్నాయి. మనం జాలిపడి వదిలేస్తే, వాటికి జాలి విలువ తెలియక సడెన్‌గా ఎగబడితే అప్పటి పరిస్దితి ఎలా ఉంటుందంటే చెప్పడం కంటే ఇక్కడ జరిగిన ఘటనను చూస్తే మీకే అర్ధం అవుతుంది.. తెలంగాణాలో సూర్యాపేట లో జరిగిన ఈ ఘటన తాలుకు వివరాలు చూస్తే.. సూర్యాపేటలోని స్దానికంగా ఉన్న ఒక బజార్‌లోకి ఉన్న జనాల మధ్యకు వచ్చిన కొండ ముచ్చు.. అటు ఇటు తిరిగి, ఆ తర్వాత రోడ్డెక్కింది.

 

 

అదే సమయంలో అక్కడ ఒక వ్యక్తి తన వాహనం మీద ఎక్కి బయలుదేరడానికి బండి స్టార్ట్ చేయబోయాడు. అంతలోనే  అతన్ని చూసిన ఆ కొండముచ్చు, ముచ్చటపడి అతనికి ఎదురుగా ఉన్న ఆ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ మీద కూర్చుంది. ఆ వ్యక్తి లోలోన కొంత భయపడుతూనే ఉన్నాడు. కానీ అతని కంగారు తగ్గించాలని అతనితో సైయ్యాటకు దిగింది. కవ్వించడం, అతని భుజం మీద చేతులు వేసి ముఖంలో ముఖం పెట్టి చూడటం లాంటి కొన్ని వెకిలి చేష్టలు చేస్తుండగా, ఆ కొండముచ్చు అతన్ని ఏమి అనదు అనే నమ్మకానికి వచ్చిన అతనికి ఊహించని షాకిచ్చింది.

 

 

ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. యువకుడు దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగానే అది అతని గొంతు కొరికి పారిపోయింది. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.. కాగా, 20 రోజులుగా కొండముచ్చు ఇలా దాడులకు పాల్పడుతోందని సూర్యాపేట వాసులు వాపోతున్నారు. వెంటనే ఆ కొండముచ్చుని బంధించి జనాలకు దూరంగా వదిలేయాలని అధికారులను డిమాండ్ చేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: