పల్లెటూళ్ళో బ్రతుకీడ్చే ముసలి వాళ్లు, వాళ్ల ముఖానికి ఏం తెలుసు.. మేం నగర జీవులం, రాత్రిపగలు పుస్తకాలతో కుస్తీ పట్టాం, ప్రత్యేకంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కోర్సులు చేశాం. ఇక మా పిల్లవాడికి ఇలాంటి పరిస్దితులు తలెత్త వద్దని చిన్నప్పటి నుండే వేల వేలకు ఫీజులు కట్టి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లో చదివిపిస్తున్నాం అని ముచ్చటించుకోని వారుండరు.. ఎందుకంటే ఈ కాలంలో తెలుగు మీడియం చదువులకంటే ఇంగ్లీషు  మీడియం చదువులకే విలువ ఎక్కువ.. ఏ ఉద్యోగానికి వెళ్లిన అక్కడ ఇంటర్ఫ్యూలు ఇంగ్లీషులోనే జరుగుతున్నాయి..

 

 

ఇక ఫారీన్ వెళ్లాలంటే ఈ ఆంగ్లము తప్పని సరి.. ఇకపోతే ఇక్కడ కనిపించే ఓ బామ్మను చూస్తే అచ్చం ఏం తెలియని అమాయకురాలిగా కనిపిస్తుంది.. కానీ నోరు విప్పితే ఇంగ్లీష్ మాత్రం గడ గడలాడిస్తుంది.. ఇకపోతే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక బామ్మ ప్రస్తుతం ఓడిస్సాలో నివసిస్తుంది. ఆమె మహాత్మా గాంధీ గురించి ఇంగ్లీష్ లో చెప్తుండగా అక్కడ ఉన్న వారిలో ఒకరు వీడియో తీసారు.

 

 

మహాత్మా గాంధీ హిందూ, ముస్లింలను సమానంగా ప్రేమించేవారనీ… ఆయన సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారనీ… చాలా సాదాసీదాగా ఉండేవారనీ… ఎక్కువగా మేక పాలు తాగేవారనీ… ఆయన మన దేశానికి జాతిపిత అనీ. మహాత్మాగాంధీ అహింసను ఇష్టపడేవారని గడ గడా ఇంగ్లీష్‌లో చెబుతుంటే అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోవడం జరిగింది.. వారే కాదు ఈ బామ్మ మాట్లాడిన ఇంగ్లీష్ చూస్తే మాత్రం మనం ఫిదా అయిపోతాం.

 

 

ఇకపోతే ఈ వీడియో ని భువనేశ్వర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ బొత్రా పోస్టు చేశారు. ఇక ఇలాంటి ఇంగ్లీష్, ఇంగ్లీష్ మీడియంలో చదివినవారు కూడా ఇంత సృష్టంగా మాట్లాడరేమో అని అనుకుంటున్నారట.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: