అడవిలో జంతువులు చేసే పనులు చిత్రంగా ఉంటాయి.. చక్కగా ఆడుకోవాలన్నా, కోపంగా కుమ్ముకోవాలన్న మాకు మేమే సాటి అన్నట్లుగా ఉంటాయి.. జంతువుల ప్రేమలు ఈ మనుషులకు అర్ధం కావు.. అవి లోపల కుట్రలతో బ్రతకవు కదా.. కేవలం బ్రతకడం కోసం పోరాటం చేస్తాయి.. కాని మనుషులు మాత్రం, తాము బ్రతకడానికి చాలినంత ఉన్న పక్కవాడి బ్రతుకుని చెడగొట్టడానికి ఆరాటపడతాడు..

ఇకపోతే అడవికి రారాజు సింహం.. ఆ సింహం దగ్గరికి వెళ్లాలంటే అడవిలో ఉన్న జంతువులకు భయం అంటారు.. ఇది మనం చిన్నప్పటి నుండి చదువుకున్న కధల్లో ఉన్న విషయం.. ఇకపోతే నక్కలు స్వతహాగా వేటాడవు.. ఏ జంతువైన తినగా మిగిలిన మాంసాన్ని అవి లాక్కెళ్లి ఆరగిస్తాయి.. ఇక ఇక్కడ కనిపించే వీడియోలో ఒక సింహం అలసిపోయి నిదురపోతున్న సమయాన, దాని దగ్గరికి ఒక నక్కవెళ్లి అతి పెద్ద సాహసం చేసింది.

ఆ సింహం తోక పైకి లేచి కనిపించే సరికి అదేమైనా చచ్చిన జంతువు తాలూకు మాంసం అనుకుందో ఏమో కాని ఆ సింహం దగ్గరకు వెళ్లి దాని తోక కొరికింది. అంతే ఆ సింహం ఒక్క సారిగా లేచేసరికి బ్రతికుంటే మరోచోట ఆహారం దొరుకుతుంది.. దీనికి దొరికామంటే నేను దానికి ఆహారమైపోతా అంటూ కాళ్లకు బుద్ధి చెప్పి వేగంగా పరిగెత్తింది.. ఇకపోతే ఈ వీడియో మాత్రం నెట్టింట్లో తెగవైరల్ అవుతుంది..

దీన్ని చూసిన వారు.. ఆ నక్క చేసే చిలిపిచేష్టలో, లేక దానికి ఉన్న ధైర్యమో తెలియదుగాని అది వేసిన ఎత్తు చిత్తె పోయిందనుకుంటున్నారు.. ఇక నవ్వు తెచ్చేలా ఉన్నా ఈ వీడియోలోని దృష్యం ఆలోచించేలా కూడా ఉంది.. అదేమంటే అనుకోకుండా ఎదురయ్యే ఆపద నుండి భయపడి చేతులు మూడ్చుకుని కూర్చోకుండా వేగంగా స్పందించి ఆ అపాయం నుండి భయటపడాలనే నీతిని బోధిస్తుంది.. ఇక ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: