పెళ్లి అనేది జీవితంలో ఒక మధురమైన ఘట్టం.. ఎందుకంటే బ్రతికి ఉన్నంత కాలం ఆ జంటకు చివరి వరకు మిగిలే జ్ఞాపకాలు ఇవే.. అయితే ఈ మధ్యకాలంలో ప్రతి వారు పెళ్లిని ఎంతో అట్టహసంగా చేసుకుంటున్నారు.. ఇందుకు గాను ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.. ఇక పెళ్ళి ఈ అమ్మాయితో అనగానే వివాహం ముగిసే వరకు  ఆ జంట మధ్య ఎన్నో చాటుమాటు ఊసులు గమ్మత్తుగా అనిపిస్తాయి..

 

 

ఇదే కాకుండా ఈ పెళ్లిలో భాగంగా వధు వరులు పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ తీసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమై పోయింది. ఇంకా చెప్పాలంటే ఈ ఆనవాయితీ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తమ ప్రీ వెడ్డింగ్‌ ఫోటో షూట్‌ను చాలా గ్రాండ్‌గా తీసుకోవాలనుకున్నారు  ఇండో-అమెరికన్‌ దంపతులు. అందుకు కాలిఫోర్నియాలోని మలీబు ప్రాంతంలో ఉన్న సాడల్‌రాక్‌ రాంచ్‌ను ఎంచుకొన్నారు...

 

 

ఇక ఆ దంపతులిద్దరు తమ ఫోటోషూట్‌ను జిరాఫీ ఎన్‌క్లోజర్‌ వద్ద ప్రారంభించారు.. ఇంతవరకు బాగానే ఉంది.. మీరొక్కరే ఫోటో షూట్‌ చేసుకుంటే ఎలా.. నేనున్నానని గుర్తు లేదా అంటూ ఆ ఫోటో షూట్‌ మధ్యలో వచ్చి చేరింది.. దాన్ని గమనించని ఆ కొత్త జంట తమ ఫొటోషూట్‌లో బిజీగా ఉన్నారు. ఇలాగైతే తానున్నానని, వారికి తెలియదనుకుని, పెళ్లికొడుకు తలపాగాను గమనించిన జిరాఫీ, తన నోటితో పైకి లాగేసింది.

 

 

దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన పెళ్లికూతురు తలపాగాను జిరాఫీ నోటి నుంచి లాగడానికి ప్రయత్నించింది కానీ ఆమె ఆటలు చెల్లలేదు..ఇక ఆ జీరాఫీ ఆ తలపాగను పైకి తీసుకునే లోపలే ఫొటోషూట్‌ తీస్తున్న వ్యక్తి  కిందకు లాక్కున్నాడు. అయితే ఈ ఘటనతో ఉలిక్కిపడిన పెళ్లికొడుకు కాసేపటికి తాను చేసిన పనికి నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తూ వైరల్ అవుతుంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: