కన్నపిల్లలంటే కడుపున పెట్టుకుని చూసుకునే తల్లులు కూడా ఉన్నారు.. తాము కష్టపడ్ద తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించే తల్లిదండ్రులు ఇంకా లోకంలో అక్కడక్కడ ఉన్నారు కాబట్టి భూమిమీద ప్రేమ అనే పదం మిగిలి ఉంది.. ఇక లోకంలో కడుపున పుట్టిన ఆడపిల్లలతో అసభ్యపనులు చేయించే తల్లులు ఉన్నారు.. కూతుళ్లను చెరిచే తండ్రులున్నారు.. అసలు ఇలాంటి వారికి పిల్లలు పుట్టకుంటే బాగుంటుందనిపిస్తుంది.. అందరు అలా ఉంటారని కాదు.. కానీ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి..

 

 

ఇకపోతే ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకు వేధింపులు ఎక్కువవుతున్నాయి.. ఇంట్లోనుండి కాలు బయట పెడితే చాలు అడుగడుగున కామాంధులు కాపు కాస్తున్నారు.. ఇదిగో ఇలాంటి వాడే ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పొట్టి వెధవ.. వీడొక ఆటో డ్రైవర్.. బుద్ధి చెడి స్కూల్‌కు వెళ్లే అమ్మాయిని ఏడిపించాడు.. ఆ బాలిక కొంత కాలం ఓపిక పట్టింది.. చివరికి అతని టార్చర్ ఎక్కువ అవడంతో తట్టుకోలేక తల్లికి చెప్పగా.. ఆమెలో దాగున్న కోపం కట్టలు తెంచుకుంది.. తెలంగాణ శకుంతల్లా రెచ్చిపోయి ఆ పొట్టినాయాల్ని గట్టిగానే తగిలించింది.. అదికూడా ఆ బాలిక చదువుతున్న స్కూల్ దగ్గర దొరకబట్టి, స్కూల్ లోపలికి తీసుకెళ్లి, అక్కడి విద్యార్ధినులు అందరు చూస్తుండగా స్దానికుల సహాయంతో వీపుని చింతపండు చేసింది..

 

 

ఆ దెబ్బలకు జీవితంలో ఆ అటోవాడు మరో అమ్మాయి మోహం చూస్తే అంత ఒట్టు.. ఇక ఆ బాలిక పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సా కోడేరులో పదో తరగతి చదువు తుండగా, లగ్గం చేసుకున్న ఆ అటోడ్రైవర్ పేరుపాలెంకు చెందినవాడిగా గుర్తించారు.. ఇక స్కూళ్లోనే లగ్గం, నాగెళ్లి అయినాక ఆ వెధవని పోలీసులకు అప్పగించింది. అప్పటి వరకు శివంగిలా ఊగిపోయిన ఆ విద్యార్ధిని తల్లి.. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్స్ ప్రశంసలు అందుకుంటుంది.. ప్రతి తల్లి ఇలా దైర్యంగా ఉంటే, ఆడపిల్లల జోలికి రావాలంటే ఉచ్చ పడుతుంది పోకిరి గాళ్లకు అని అంటున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: