కరోనా అంటే కిలోమీటర్ దూరం పారిపోవలసిన పరిస్దితులు ఇప్పుడు దేశంలో నెలకొన్నాయి.. ఇలాంటి పరిస్దితుల్లో ప్రపంచ వ్యాప్తంగా పలురకాలుగా కరోనాను నివారించడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు.. ఇక వైద్యులైతే ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే తప్పకుండా పరిశుభ్రంగా ఉండాలని సూచిస్తున్న నేపథ్యంలో, ప్రజలు ఎప్పటికప్పుడు తమ చేతులను శుభ్రం చేసుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్‌కు ఎంత డిమాండు పెరిగిందో తెలిసిందే..

 

 

ఇకపోతే తన కరోనా వైరస్ పాకిస్థాన్‌ను కూడా కలవరపెడుతోంది. ప్రపంచం అంతా చుట్టేస్తున్న కరోనా పాకిస్దాన్‌లో కూడా అడుగుపెట్టింది.. కాగా ఇప్పుడే తనప్రతాపాన్ని చూపించడం ప్రారంభిస్తున్న నేపధ్యంలో అక్కడి ప్రజలు కూడా పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులకు డిమాండు భారీగా పెరిగింది. ఇక ఒక వ్యక్తి సూపర్ మార్కెట్లోకి వెళ్ళి అంతా తిరిగినాక, తన చేతులను శుభ్రపరచుకోవాలని అనుకుని అక్కడ కనిపించే పరికరాన్ని సరిగ్గా గుర్తించక, తాను అమాయకంగా చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

పాకిస్దాన్‌లోని గుజరంవాలా సూపర్ మార్కెట్లో ఓ పెద్దాయన ఫోన్ మాట్లాడుతూ అక్కడ కనిపించిన ఓ బాక్స్ వద్దకు వెళ్లి దాన్ని శానిటైజర్ అని భావించి చేతులు దానికిందపెట్టి ప్రెస్ చేశాడు.. అందులో నుండి శానిటైజర్ రాకుండా ఒక్కసారిగా తెల్లటి పొగ బయటకు వచ్చి క్షణాల్లో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఈ హఠాత్పరిణామానికి అతడు షాకయ్యాడు. కానీ తాను నొక్కింది ఫైర్ సేఫ్టీ కోసం ఏర్పాటుచేసిన అగ్నిమాపక పరికరం యొక్క బటన్ అని ఇంకా గుర్తించనట్లు ఉన్నాడు ఆ అమాయకుడు..

 

 

కాస్త తటపాయించిన మనకెందుకులే అని అనుకున్నాడేమో అక్కడినుండి ఏం తెలియని వాడిలా అమాయకంగా వెళ్లిపోయాడు.. అయితే ఈ ఘటన అంతా అక్కడ ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.. చూసారా తెలియకచేసిన పనికి ఈ పాకిస్దానీయుడు ఎలా నవ్వులపాలు అయ్యాడో అని నెటిజన్స్ అనుకుంటున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: