ఒకప్పుడు పెళ్లికి ముందు 'లవ్' ఎలా ఉండేదో, ఇప్పటి జనరేషన్ యూత్ కి ఆ ప్రేమకు ముందు సెక్స్ కూడా అంతే అవసరమైపోయింది. మరికొందరు దీన్నే డేటింగ్ అని బయటకి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇప్పుడు వివిధ డేటింగ్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. వీటి ద్వారా ఒకరి అభిరుచులు, ఒకరి అభిప్రాయాలు, ఇష్టాలను మరొకరు తెలుసుకుంటూ ఉంటున్నారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఒక యువకుడు తనకు ఎంతో ఇష్టమైన అమ్మాయిని డేటింగ్ కి ఆహ్వానించాడు. అయితే అందిరిలా చేస్తే తన గుర్తింపు ఏముంది అనుకున్నాడో ఏమో దీనికోసం కొత్త పంథాను ఎంచుకున్నాడు.

సాధారణంగా ఏ సంస్థలో అయినా మనకి ఉద్యోగం కావాలంటే రెజ్యూమె పంపిస్తాం. మన విద్యార్హతలు, ఎక్స్పీరియన్సెస్, హాబీస్ మొదలైనవి పొందుపరచి రెజ్యూమె రెడీ చేస్తాం. అయితే ఇక్కడ అమెరికాకు చెందిన ఈ కుర్రాడు మాత్రం జాబ్ కోసం వాడే రెజ్యూమేను తను ప్రేమించిన అమ్మాయిని ప్రేమలో పడేయడానికి యూజ్ చేసాడు. ఇందులో భాగంగా తన హైట్, వెయిట్, కలర్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తదితర వివరాలను పొందుపరచి ఆ అమ్మాయికి పంపించాడు. ఈ రెజ్యూమెను ఆ అమ్మాయి సోషల్ మీడియాలలో పోస్ట్ చేయడంతో ట్రెండింగ్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే  అమెరికాలోని ఒక యూనివర్సిటీలో చదువుతున్న అబ్బాయి అదే యూనివర్సిటీలో చదువుతున్న అమ్మాయిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం ఆమెకు చెప్పే ధైర్యం లేని కుర్రాడు కళ్ళతోనే ఆరాధించడం మొదలుపెట్టాడు. అయితే తన చివరి సెమిస్టర్ కూడా పూర్తయ్యే సమయం రావడంతో కలవరపడిన ఆ అబ్బాయి అమ్మాయికి విషయం చెప్పేసాడు. ఇదే విషయాన్ని ఒక లెటర్ ద్వారా చెప్పమని కోరిన తన లవర్ కోరిక మేరకు ఈ కుర్రాడు ఏకంగా ఒక రెజ్యూమె టైప్ చేసి పంపించాడు. ఈ రెజ్యూమెలో తన వివరాలతో పాటు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వివరాలు కూడా మెన్షన్ చేసాడు. తనకు ఆడవాళ్లంటే గౌరవమని, తన అమ్మ లాగా చూసుకుంటానని పేర్కొన్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది. కొందరు ఆ అబ్బాయితో డేటింగ్ కాదు పెళ్లే చేసుకోమని సలహా ఇస్తుంటే, మరికొందరు ఎందుకైనా మంచింది తన ఎక్స్ ని అడిగి తర్వాత ప్రొసీడ్ అవ్వమని జాగ్రత్తలు చెప్తున్నారు. ఏదేమైనా రెజ్యూమే లవ్ లెటర్ తో వెరైటీగా ఆలోచించి వార్తల్లో నిలిచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: