బాధ్యత గల వ్యక్తుల ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉంటాయి.. బలహీనులు ఆలోచనలు ఎప్పుడు నీచంగా ఉంటాయి.. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తూ కరోనా కంటపడకుండా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండని ఎన్ని రకాల మార్గాలున్నాయో అన్ని దారుల్లో ప్రచారం చేస్తుంది.. కానీ కొందరు అవివేకంతో ప్రవర్తిస్తూ, వాటిని పెడచెవిన పెడుతున్నారు.. అంతే కాదు ప్రజలను రక్షిస్తున్న పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు.. ప్రస్తుతం పోలీసులు కూడా ప్రజల ఆరోగ్యం కోసమే ఎంతగానో శ్రమిస్తున్నారు.. అందర్ని కాపాడుతున్నారు.. ఇలాంటి సమయంలో కొందరు వెధవలు అకారణంగా రోడ్లపైకి రావడం, లేదా ఇద్దరు ఇద్దరు వాహనాలపై తిరగడం చేస్తున్నారు..

 

 

ఇలాంటి వారి వల్ల కరోనా ఇతరులకు అంటుకునే అవకాశాలు ఉన్నాయి.. కనీసం పోలీసులు కొడుతున్నారనే భయం కూడా లేకుండా బయట తిరుగుతున్నారు. లాక్‌డౌన్ నిబంధన ఉల్లంఘించి బయట తిరిగేవారికి వేరే దేశాల్లో అయితే కఠినమైన శిక్షలు అమల్లో ఉన్నాయి. ఇండియాలో మాత్రమే ఎలాంటి శిక్ష విధించకుండా ఇంట్లో కుర్చోమని చెప్పారు. అయినా సరే, ప్రజలు మాట వినడం లేదు. ఇకపోతే పోలీసు లాఠీల దెబ్బల నుంచి తప్పించుకోడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇద్దరు యువకులు చేసిన పనికి నవ్వు ఆగదు కానీ వారు ప్రవర్తించిన విధానం సరైంది కాదు..

 

 

ఇంతకు ఏం జరిగిందంటే తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు యువకులు బైకు మీద వెళ్తుంటే పోలీసులు ఆపారు. ఏ పని లేకున్నా రోడ్ల మీదకు వచ్చినందుకు పోలీస్ కానిస్టేబుల్ వారిని కొట్టేందుకు ప్రయత్నించగా, వెనక సీట్లో కుర్చున్న యువకుడు లాఠీ దెబ్బ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో లాఠీ మీద కుర్చున్నాడు. దీంతో కానిస్టేబుల్ ఆ లాఠీని తీసుకోలేకపోయాడు. ఆ యువకులు కూడా లాఠీని తిరిగి ఇవ్వకుండా తమతోపాటే తీసుకెళ్లిపోయారు. మరో కానిస్టేబుల్ వారిని పట్టుకోడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇది చూసేందుకు ఫన్నీగానే ఉండవచ్చు. కానీ ఇలాంటి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే యువకులను అస్సలు ప్రోత్సహించకూడదని నెటిజన్లు కోపానికి వస్తున్నారు.. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: