బాసు పోలీసులేంటి ఇంతలా రెచ్చిపోతున్నారు.. అంటారా.. తప్పదు మరీ ఒక వైపు డ్యూటీ ప్రెస్టేషన్.. మరో వైపు కరోనా టెన్షన్.. అరే రాత్రిపగలు పెళ్లాం పిల్లలను వదిలి వాడవాడల తిరుగుతూ గస్తీ కాస్తుంటే.. అదేమీ పట్టించుకోకుండా గుంపులు గుంపులు ఉండకండిరా బాబు.. హాయిగా ఇంట్లో ఉండి రెస్టు తీసుకోండిరా నాయనల్లారా అంటే వినడం లేదు.. ఎంత వినకుంటే మాత్రం ఇంతలా బాదాలా.. అది ఒక మనిషి అని కూడా చూడకుండా గొడ్డును బాదినట్టుగా బాదడమా.. మరి దారుణం రా బాబు..

 

 

అరే బయట కనిపిస్తే లాఠీతో తాట తీస్తారు కానీ ఇలా ఇంటికి వచ్చి మరీ వాయించడం ఏం బాగోలేదురా.. అంటూ పెట్టుకుంటున్న ఈ ముచ్చట సంగతి ఏంటో తెలుసా.. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ .. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఘటన మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అదేమంటే లాక్‌డౌన్ సమయంలో ఓ ముగ్గురు పేకాట ఆడుకుంటూ ఉన్నారట.. అసలే ఇళ్ల వద్ద కూడా గుంపులుగా ఉండకూడదన్న నియమం ఉంది.. కాగా అందులో పేకాట ఆడుతుండటంతో ఎవరైనా చెప్పారో ఏమో తెలియదు గాని ఆ ముగ్గురుని రోడ్దు పై వారి ఇంటి ముందే మోకాళ్లపై వంగోబెట్టిన పోలీసులు బంతిని సిక్స్ బాదినట్టుగా వారి బ్యాకు ను బాదారు..

 

 

ఈ దృష్యం చూస్తుంటే నేరగాళ్లను కొట్టినట్లుగా అనిపిస్తుంది.. అయితే, పిల్లలు చూస్తున్నా కనికరం లేకుండా.. రోడ్డుపై, మోగాళ్లపై వంగోబెట్టి కొట్టడమే అనైతికంగా ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొట్టడం కాకుండా ఇంకా చాలా శిక్షలు అమల్లో ఉన్నాయని, పిల్లల ముందే కుటుంబికులను అలా కొట్టడం సబబుగా లేదనే విమర్శలు వస్తున్నాయి. వారిని కొడుతుంటే చిన్నారులు భయంతో ఏడ్వడాన్ని ఇక్కడ గమనించవచ్చు.. అయితే, అంతా గుంపులుగా కుర్చొని పేకాట ఆడుతున్నారనే కారణంతోనే పోలీసులు ఈ శిక్ష వేసినట్లు సమాచారం. ఏదైతేనేమి మరి ఇంత దారుణంగా కొట్టడం కాకుండా మరేదైనా శిక్ష వేస్తే బాగుండు అని అంటున్నారు..  

 

 

     

మరింత సమాచారం తెలుసుకోండి: