లోకంలో.. కాలంతో పనిలేకుండా.. ఎప్పుడు కష్టపడే వ్యక్తి ఎవరంటే.. కర్షకుడు అని చెప్పవచ్చూ.. భరత జాతికి ముద్దుబిడ్ద, జాతి భృతికి కంకణం కట్టుకొని. అతివృష్ఠి అనావృష్టి సంఘర్షణలో. నిత్యం నలిగే ఇరుసు ముక్క. తొలకరి చినుకులకే పులకరించి, మునుపటి కష్టాలను మరచిపోయే.. మంద బుద్ధివాడు రైతు... మట్టి వాసనాలకే పాలనురగలా పొంగిపోయే వాడు.. విత్తనాలకై అప్పులు వెతికేవాడు రైతు.. ఇప్పటికి ఎప్పటికి ప్రపంచంలో పేదవానిగా మిగిలే వాడు రైతు..

 

 

ఇలాంటి కష్టనష్టాలు రైతు జీవితంలో నిత్యం స్నేహితుల మల్లే అడుగడుగున కనిపిస్తాయి.. ఇలాంటి రైతు ఈ కరోనా నేపధ్యం లో పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.. రెక్కలు ముక్కలు చేసుకుని, తన శ్రమను ధారబోసి, పంట పొలాలను పసివారి కంటే ఎక్కువగా ప్రేమించే రైతులున్నారు.. వారంతా ప్రస్తుత పరిస్దితుల్లో అలమటిస్తున్నారు.. ఇలాంటి వారు ఎందరో ఉన్న మన అవనిలో ఒక్కో రైతు ఆవేదన ఒక్కొక్క రూపకంగా బయటకు వస్తుంది..

 

 

కొందరు ఏడుస్తూ కూర్చుంటే, మరికొందరు పరిస్దితులను నిందిస్తు ఉన్నారు.. ఇంకొందరు కరోనా తెచ్చిన వారిని కసితీరా కడిగేస్తున్నారు.. ఇలాంటి ఆవేదనే ఏపీకి చెందిన ఓ రైతు సెల్ఫీ వీడియో ద్వారా వెళ్లగక్కాడు.. ఎవడో డబ్బు మీది వ్యామోహంతో విదేశాలకు వెళ్లి కరోనా వ్యాధిని తెచ్చి అందరికీ అంటిచాడు. గొప్పవాళ్లు వ్యాధులు తెస్తుంటే.. పేదవాళ్లను ఎందుకు శిక్షిస్తున్నారు.

 

 

లాక్‌డౌన్ నుంచి కనీసం రైతులకైనా ఉపశమనం కల్పించండి. పంటలు ఎండి పోతున్నాయి అంటూ ఈ రైతు పడుతున్న బాధ.. మనసుపెట్టి చూసిన వారికి పురిటినొప్పులతో నలిగిపోతున్న ఓ తల్లి ఆవేదనలా కనిపిస్తుంది.. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఇంకా ఈ రైతు ఏమేమి మాట్లాడాడో ఈ క్రింది వీడియోలో మీరే చూడండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: