టాప్ హీరో గానీ, యూత్ హీరోగానీ వీరి సినిమా ఏదైనా రిలీజ్ అయ్యి ట్రెండ్ క్రియేట్ చేసిందనుకో.. అందులో హీరో అనుకరించిన హేర్ స్టైల్ గానీ, డ్రెస్‌లు గానీ, అతని స్టైల్ గానీ బాగా పాపులర్ అవడం మనం చూస్తూనే ఉంటాం.. ఇక ఆ సినిమా చూసిన తర్వాత యూత్, ఆ హీరోలో తమను ఊహించుకుని, ఆ ఊహల్లో కొంతకాలం జీవిస్తుంటారు.. నేటి యువతకు ఇదొక ఫ్యాషన్.. ఇకపోతే కొందరైతే ఫోటో షూట్లని కెమెరాలు భుజాలకు వేసుకుని చెట్లవెంట, పుట్టల వెంట తిరుగుతుంటారు.. మరి కొందరిని చూస్తే అయితే చిన్నపిల్లలు బూచాడని బయపడేలా ఉంటారు.. జుట్టు బారెడు పెంచుకుని, అది ముఖం నిండా కప్పుకుని, పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకుని దొంగల్లా రోడ్లమీద షో చేస్తుంటారు..

 

 

ఇలాంటి వారిలో ఒక యూత్ కాకుండా మధ్య వయస్సు వారు కూడా ఉండటం ఆశ్చర్యం.. ఇక ఈ ప్రపంచంలో ఎవరి జీవితానికి వారు హీరోలే.. ఒక స్టైల్ కొడితేనే హీరో కాదు.. నిత్యజీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు, సమస్యలను రోజు ధైర్యంగా ఎదుర్కొంటు ముందుకు సాగే ప్రతి వారు హీరోలే అని చెప్పవచ్చూ.. ఇకపోతే ఈ మధ్యకాలంలో అందరికి టిక్‌టాక్ పిచ్చి ముదిరిపోయింది.. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా దాదాపుగా అన్ని చోట్ల టిక్ టాక్‌లు చేస్తూ ఉన్నారు.. కొందరికైతే టిక్‌టాక్ చేయకుంటే అసలు నిదురే పట్టదు.. కనీసం రోజుకు ఇన్ని వీడియోలైన టిక్‌టాక్‌లో పెట్టాలని వారికి వారు కమిట్‌మెంట్ ఇచ్చుకుంటారు..

 

 

ఇదిగో ఇక్కడ ఒక టిక్ టాక్ పిచ్చోడు ఇలానే హైవే మీద టిక్ టాక్ వీడియో చేసి పాపులర్ అవుదామనుకున్నాడు.. కానీ ఆ యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. అదేమంటే ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ.. సల్మాన్ ఖాన్ తరహాలో షర్ట్ గాల్లోకి విసిరాడు. అదే సమయంలో అటుగా వస్తున్న బైకర్లు ఆ షర్ట్‌ను క్యాచ్ చేసి.. ఎత్తుకుపోయారు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతుంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: