ప్రపంచాన్ని కోలుకోకుండా చేసిన, చేస్తున్న కరోనా.. ఎంత పెద్ద ప్రమాదకారి అన్న విషయం ఇప్పటికే అందరికి అర్ధం అయ్యి ఉంటుంది.. ఇక దీని బాధను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వారి కష్టాలైతే వేరేగా చెప్పవలసిన అవసరం లేదు.. ఇప్పటికే ప్రముఖల దగ్గరి నుండి, పేదల వరకు అందరి కాళ్లకు సంకెళ్లు వేసి ఇంట్లో కూర్చోపెట్టింద లోకం మొత్తం నిశబ్ధంలోకి వెళ్లిపోయింది..

 

 

ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న ప్రకృతి ప్రశాంతంగా ఉంది.. గాలిలోకి కలుషిత వాయువులు లేవు.. రణగొణ ధ్వనులు లేవు.. పొద్దున లేచినప్పటినుండి మొదలుపెట్టే ఉరుకులు పరుగులు లేవు.. ఇలాంటి సమయంలో ఒక కరోనా తప్ప ఏ మాట ఎవరి నోట వినపడటం లేదు.. ఇకపోతే కరోనా విషయంలో టాలీవుడ్ దగ్గరి నుండి హలీవుడ్ వరకు.. క్రీడాకారులు కూడా తమ వంతుగా ఇలా అందరు సెలబ్రిటీలు ఇప్పటికే తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు..

 

 

కాగా ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం ముందుకు వచ్చింది. కాగా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో, వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రధాని నరేంద్ర మోడీ క్రీడాకారుల్ని కోరిన విషయం తెలిసిందే.. అంతే కాదు తెలుగు షట్లర్ పీవీ సింధుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో.. పీవీ సింధు.. కరోనా వైరస్ కట్టడి కోసం ఓ వీడియో ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. దేశంలో లాక్‌డౌన్ ఉండటంతో.. ఈ వీడియోను ఆమె తండ్రి పీవీ రమణ తన మొబైల్‌లో షూట్ చేయడం విశేషం... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: