కరోనా వచ్చి పుడమి భారాన్ని తగ్గిస్తుందో లేక.. ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తుందో అర్ధం కావడంలేదు.. ఒక్క చినుకులా మొదలై.. చివరికి తుఫానులా మారి.. దేశాల్లోని జనాలను.. అందమైన నగరాలను తనలో కలిపేసుకుంటుంది.. కన్నీరు విలువ తెలియని మనుషులకు కన్నీటి రుచి చూపిస్తుంది.. ఇన్నాళ్లూ రాజభోగాలు అనుభవించిన కొన్ని దేశాల ప్రజలకు నరకం అంటే ఏంటో పరిచయం చేస్తుంది.. బ్రతుకు విలువను అర్ధం అయ్యేలా చెబుతుంది.. ఇప్పటికే చాలా మంది కరోనా రాకుండా కాపాడు దేవుడా అంటూ భయంతో బిక్కు బిక్కుమని కాలాన్ని వెళ్లదీస్తున్నారు.. నిశబ్ధంగా ఉన్న నిశీధిలో ఒక అణుబాంబు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో ఈ కరోనా కూడా అంతే..

 

 

ఇకపోతే ప్రస్తుత పరిస్దితుల్లో న్యూయార్క్‌లో పాజిటివ్ కేసులతో పాటుగా, మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యం లో వైరస్ మూలంగా మరణించిన వారిని తమ కుటుంబ సభ్యులకు కూడా చూపించడం లేదట.. ప్రస్తుతం న్యూయార్క్‌ లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అక్కడ నివసిస్తోన్న హీరోయిన్ మాన్య చెప్పారు. ఈవిడ ఒకప్పటి హీరోయిన్.. అక్కడ నెలకొన్న దారుణమైన పరిస్దితులను వివరిస్తూ, ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేసి వెల్లడించారు.. ఇకపోతే పది సంవత్సరాల క్రితం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన. ప్రస్తుతానికి, న్యూయార్క్ సిటీలో ఫైనాన్స్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నారు..

 

 

ఈవిడ ఇల్లు న్యూయార్క్ సిటీలోని టైమ్ స్క్వేర్‌కు దగ్గరలోనే ఉందట. ప్రస్తుతం ట్రై స్టేట్ ఏరియాలో సుమారు ఒక లక్షా ఇరవై వేల మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యిందని, వారిలో 2,800 మంది చనిపోగా, న్యూయార్క్ సిటీలోనే 15వేల మందికి కరోనా సోకిందట. సుమారుగా 1400 మంది మృతి చెందగా వీరిలో, డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందితో పాటుగా, ఏడు వారాల చిన్నారి కూడా కరోనాతో చనిపోయిందని తెలిపింది.. ఇక మరణించిన వారి శరీరాలను క్రేన్‌తో ట్రక్కులో వేస్తున్నారని, ఆ ట్రక్కుల్లో ఐస్ వేసి డెడ్ బాడీస్‌ను డిస్పోజ్ చేస్తున్నారని, కనీసం మృతదేహాన్ని కూడా తాకనివ్వడం లేదని.. తెలిపారు.

 

 

తన ఫ్రెండ్ వాళ్ల నాన్న చనిపోతే.. చివరిచూపు చూసుకోవడం కూడా కుదరలేదని చెప్పారు. ప్రస్తుతమైతే న్యూయార్క్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అందమైన నగరాల్లో ఒకటైన న్యూయార్క్ సిటీని ఇలాంటి స్థితిలో చూస్తాననుకోలేదని బాధతో తెలుపుతున్నారు.. ప్రస్తుతం ఆ వీడియోను చూస్తే ఆమె వెల్లడిస్తున్న మరిన్ని విషయాలు హృదయాన్ని కదిలిస్తాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: