ట్రాఫిక్ జామ్.. ఈ పేరు వింటే నగరవాసుల గుండెల్లో దడ మొదలవుతుంది.. ఇప్పుడంటే కరోనా వచ్చి రోడ్లన్ని ఖాళీగా ఉంచుతుంది కానీ ఈ వైరస్‌కు ముందు పదినిమిషాల ప్రయాణానికి కూడా గంటలు గంటలు పట్టిన రోజులున్నాయి.. ఒక్కోసారి మన నగరంలో ట్రాఫిక్ కనుక జామ్ అయ్యిందంటే నగర జీవి కష్టాలు అన్నీ ఇన్ని కావు.. ముందే ఇక్కడ మనుషులకు అన్నీ పనులు వేగంగా జరగాలి.. అందుకే వేగంగా ప్రయాణిస్తారు. ప్రమాదాలబారిన పడతారు..

 

 

ఇకపోతే ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అయ్యిందనే మాట ఎప్పుడైనా విని ఉంటారా.. చిన్న ట్రాఫిక్ జామ్ కే చుక్కలు కనిపిస్తే ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ అంటే మాటలు కాదుకదా.. మరి అదెక్కడ అయ్యిందో తెలుసుకుందాం.. ఈ ట్రాఫిక్ జామ్ చైనాలోని బీజింగ్‌ హాంగ్‌కాంగ్‌ మకావ్‌లో జరిగింది.. మన దగ్గర సంక్రాంతి సెలవుల తర్వాత ఊర్లనుండి వచ్చే వాహనాలతో, నగర శివారుల్లోని టోల్ గేట్ల దగ్గర ఎంత ట్రాఫిక్ ఉంటుందో.. దానికి  వందల రెట్ల ట్రాఫిక్ జామ్ అక్కడైంది. వేల సంఖ్యలో వాహనాలు ఎక్కడిక్కడ రోడ్లపై ఆగిపోయాయి.. దీనికి కారణం లేకపోలేదూ.. అదేమిటంటే చైనా తమ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు నేషనల్ హాలిడే ను ప్రకటించిన ఆసమయంలో అక్కడి ప్రజలు వారం రోజుల పాటు ఎంజాయ్ చేయడానికి టూర్లకు వెళ్ళారట. వారం రోజులు ముగిసిన తర్వాత అందరు ఇంటి బాట పట్టారట... అలా అందరూ ఇంటి బాట పట్టేసరికి 50 లైన్ల రోడ్డు సైతం ఎక్కడిక్కడ జామ్ అయ్యింది.

 

 

దీంతో ఎక్కడి వారు అక్కడ తమ వాహనాలు ఆపి ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందా అంటూ ఎదురుచూస్తూ గడిపారట.. ఇక ఈ దృశ్యాలను డ్రోన్ కు అమర్చిన కెమెరా సహాయంతో తీసారు…. డ్రోన్ తీసిన విజువల్స్ ను చూసిన చైనా ప్రభుత్వమే షాక్ కు గురై ట్రాఫిక్ ను పునరుద్దరించే పనిలో పడిందట. 50 లైన్ ల రోడ్డే అంతగా ట్రాఫిక్ లో ఇరుక్కపోతే.. మన హైద్రాబాద్ పరిస్థితిని ఊహించుకుంటుంటే వామ్మో అసలు నిదురే పట్టదు.. ఎందుకంటే దాదాపు మన నగరంలో ఇలాంటి ఘటన కనుక జరిగితే ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ అవడానికి మూడునెలలలైనా పడుతుంది కావచ్చూ.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: