ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి వారి గుండెలు లబ్ డబ్ అని కొట్టుకోవడం మరచి.. కరోనా కరోనా అంటు స్పందిస్తున్నట్లు ఉన్నాయి.. ఎందుకంటే మెదడులో కరోనా విషయంలో ఎన్నో ఆలోచనలు గిర్రున తిరుగుతుంటే.. మనసు మాత్రం కరోనా బారినుండి మమ్ము కాపాడు దేవుడా అని ప్రతిక్షణం భగవంతున్ని గుర్తుకు చేసుకుంటుంది.. పూర్తిగా ప్రపంచం ఎన్నడు ఊహించని సునామిని ఈ కరోనా సృష్టించింది.. దీని దెబ్బకు కుక్కలా తిరిగే వారు కూడా పిల్లిలా నక్కి ఇంట్లోనే ఉంటున్నారు..

 

 

ఈ పరిస్దితుల్లో ఇంట్లో ఎంతవరకు ఉంటారు చెప్పండి.. గుడ్డి వారిలా ఇలా ఎన్ని రోజులు బ్రతుకుతారు.. ఇంట్లో ఉండి ఉండి మనుషులకు పిచ్చెక్కిపోతుంది.. ఇక మనుషుల పరిస్దితే ఇలా ఉంటే ఊరంత కుక్కలా తిరిగే కుక్కల పరిస్దితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.. ఇక ఇంట్లో పెంచుకునే కుక్కలకు రోజు వాకింగ్ అలవాటు.. అలాంటింది ఇప్పుడు అవికూడా బయట ఉన్న ప్రపంచాన్ని మరచి ఎప్పుడు గొలుసులతో కట్టివేయబడి ఒకే చోట ఉండటం వల్ల వాటిలో కూడా ప్రెస్టేషన్ పెరిగినట్లు ఉంది.. అందువల్ల పెంపుడు కుక్కలతో కలిసి జీవించేవారికి పెద్ద తలనొప్పిగా మారింది ఈ లాక్‌డౌన్..

 

 

ఎందుకంటే కుక్కలను రోజుల తరబడి ఇంట్లో ఉంచడం చాలా కష్టం. రోజుకు ఒక్కసారైనా వాటిని బయట తిప్పాలి. కనీసం కాలకృత్యాలు తీర్చుకోడానికైనా కాసేపు బయటకు తీసుకెళ్లాల్సిందే. పైగా, వాటికి ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండటం కంటే, ఎక్కువగా బయట తిరగడాన్నే ఇష్ట పడతాయట. అంతేగాక ఇలాంటి కుక్కలు చాలా యాక్టీవ్‌గా ఉంటాయి. ఇకపోతే ఇలా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఓ కుక్కను బయటకు షికారుకు తీసుకెళ్లగా అది తిరిగి ఇంటికి వెళ్లనని మారం చేస్తోంది..

 

 

కిట్టర్ క్లబ్ అనే యూటూబ్ చానెల్ పోస్టు చేసిన ఈ వీడియోలో.. ఆ కుక్క రోడ్డు మీద పడుకుని చనిపోయినట్లు నటిస్తోంది. దాని యజమాని రా వెళ్దామని చెబుతున్నా సరే వినిపించుకోవడం లేదు.. అది ఆస్కార్ అవార్డు కోసం పోటీ పడుతున్నట్లుగా నటించేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను చూస్తే మీరు తప్పకుండా ఫిదా అవుతారు...  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: