వైరల్ వార్తలు.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాల్ చల్ చేస్తుంటాయి.. సాధారణంగానే సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఎక్కువ.. వైరల్ వార్తలు అంటే? మనం ఎప్పుడు చుడనిది.. ఎప్పుడు జరగనిది.. ఏదైనా సరే వింతగా అనిపిస్తే దాన్నే వైరల్ వార్తలు అంటారు.. అయినా వైరల్ గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ నెలలో అందరిని ఆశ్చర్యపరుస్తూ నవ్వించిన వార్త మాత్రం ఒకటి ఉంది.. 

 

ఆ వార్తే బాతు కుక్క వార్త.. మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా నటిస్తాయి అని ఈ వీడియో చూసినప్పుడే అర్థం అయ్యింది. మనం అప్పుడప్పుడో క్లాస్ లో ఒకటి చదివాం.. ఏం చదివాం అంటే? ఓ బాలుడుని చూసి ఎలుగుబంటి వస్తుంది.. అది వచ్చినప్పుడు చచ్చినట్టు నటించడంతో ఎలుగుబంటి వెళ్ళిపోతుంది అని అప్పట్లో పాఠ్య పుస్తకాల్లో రాశారు.. అలానే ఇప్పుడే ఆ బాతు కూడా చేసింది.  

 

తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ బాతు చేసిన పని చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవడమే కాకుండా కడుపు నిండా నవ్వుతారు కూడా.. ఏంటంటే? ఓ కుక్క బాతును వేటాడి చంపేయాలనుకుంది. మెల్లగా బాతు దగ్గరకు వెళ్లింది. తన ప్రాణానికి పోంచి ఉన్న అపాయాన్ని ముందే గ్రహించిన ఆ బాతు నేలపై జీవం లేనట్లు పడిపోయింది. దీంతో కుక్క దాన్ని కాసేపు అలా చూస్తుండిపోయింది. అయినా గానీ అది ఎంతకీ కదలకపోవడంతో చనిపోయిందని భావించి అక్కడి నుంచి తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది.

 

ఇంకేముంది అలా ఆ కుక్క వెనక్కి తిరిగిందో లేదో.. బతుకు జీవుడా అంటూ ఆ బాతు పరుగులు పెట్టింది. దీంతో ఈ వీడియోను తీసిన ఓ ఐఎఫ్ఎస్ అధికారి దాన్ని ట్విట్టర్ ట్విట్ చేశారు.. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.. ఇంకా ఈ వీడియోలో ఆశ్చర్యం కంటే కూడా పెద్ద షాక్ ఏ తగిలింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: