చాలమంది సెలబ్రెటీల్లో జంతు ప్రేమికులు ఉంటారన్న విషయం తెలిసిందే.. వీరిలో చాలామంది ఇళ్లల్లో కుక్కలు మాత్రం తప్పక ఉంటాయి.. వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటారో అందరికి తెలిసిందే.. ఇంకొందరి ఇళ్లల్లో పిల్లులు కూడా పెంచుకుంటారు.. అయితే వీరిలో కొందరు మాత్రం ఇతర జంతువులను, పక్షులను కూడా పెంచుకుంటారు.. అయితే వాటికి పుట్టిన రోజులు చేసేది మాత్రం చాలా అరుదు..

 

 

ఇదిలా ఉండగా హాలీవుడ్ హీరో.. కండల వీరుడు.. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ మాత్రం తను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న గాడిదకు పుట్టిన రోజు వేడుకను నిర్వహించాడు.. ఇతను హీరోగా మాత్రమే కాకుండా కాలిఫోర్నియా 38వ గవర్నర్ గా పదవి బాధ్యతలను నిర్వర్తించి, 2011లో పదవీ విరమణ చేశాడు.. అంతే కాకుండా ప్రపంచ బాడీ బిల్డర్ గా తనకంటూ ప్రత్యేక స్థానం కూడా సంపాదించుకున్నాడు.. ఇకపోతే తాజాగా కరోనా మహమ్మారిపై పోరుకి 1.43 మిలియన్‌ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.10 కోట్లును విరాళంగా అందించారు.. అలాగే కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న డాక్టర్ల కోసం 50వేల మాస్కులను ఉచితంగా సమకూర్చారు..

 

 

కాగా తాజాగా ఆర్నాల్డ్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక వీడియో తెగ వైరల్‌ అవుతుంది. అదేంటి అనుకుంటున్నారా.. అదేనండి ఇతను ఒక గాడిదను పెంచుకుంటున్నాడు.. దీనికి మొదటి పుట్టినరోజు చేసి దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ ‌చేశాడు. ఇకపోతే ఆ గాడిదపేరు లులు.. వినడానికి పేరు బాగుంది కదా.. ఇక ఆర్నాల్డ్‌ కి ఈ లులు అంటే చాలా ఇష్టమట. అందుకే లులుకి కేక్‌ తినిపిస్తూ 'హ్యాపీ బ‌ర్త్‌డే డియ‌ర్ లులు' అంటూ పాట పాడాడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

 

 

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది.. చూసారుగా, జంతు ప్రేమికుల ప్రేమ అభిమానాలు.. నిజానికి మనుషుల్ని ప్రేమించడం కంటే ఇలాగే జంతువుల్ని ప్రేమించడం నయం.. అవి మోసాలు, దగాలు చేయవు.. అందుకే కావచ్చు కొందరు వారు పెంచుకునే జంతువులను ప్రాణానికంటే ఎక్కువగా ఇష్టపడతారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: