లోకంలో కరోనా వచ్చుడేందో ఇంత మంది చచ్చుడు ఏందో అందరికి అయోమయంగా ఉంది.. ముఖ్యంగా ఈ కరోనా వల్ల మనిషి ఇంకా వెనకబడే ఉన్నాడన్న నిజం బయటపడ్డది. దీన్ని ఎవరు ఒప్పుకున్న, ఒప్పుకోకపోయిన.. మనిషి ఇగో హర్ట్ అయినా .ఒక వైరస్ బారి నుండి ఆగ్రదేశాలతో సహా అన్ని దేశాలు తమ ప్రజల్ని కాపాడుకోలేక పోయాయంటే అర్ధం ఏంటో మీరే అర్ధం చేసుకోండి..

 

 

ఇకపోతే కరోనా వల్ల అన్ని దేశాలు ఆర్ధికంగా వెనక పడ్డాయి అంటున్నారు. అది నిజమే కావచ్చూ.. కానీ ఇలాంటి భయంకరమైన వ్యాధులు గానీ మరే ఇతర విపత్తులు గాని సంభవించినప్పుడు మనుషుల కంటే మర మనుషులనే ఎక్కువగా వాడటం వల్ల కొంత నష్టాన్ని నివారించ వచ్చు అనేది ఈ కరోనా సమయంలో నిరూపించబడింది.. కొన్ని మనుషులు చేసే పనులుంటాయి.. మరికొన్ని చేయకుడని పనులు ఉంటాయి.. ఉదాహరణకు కరోనా వచ్చిన రోగి దగ్గరకు ఒక మనిషి వెళ్లాలంటే ఎంత తతంగం ఉంటుంది.. అందులో ఆ వ్యాధి వ్యాపించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక్కోసారి వికటించి సేవచేస్తున్న వైద్య సిబ్బందికి కూడా సోకి మరణించిన సందర్భాలు ఉన్నాయి..

 

 

ఒక సైనికున్ని కోల్పోతే దేశానికి ఎంత నష్టమో.. ఒక వైద్య సిబ్బందిని ఇలాంటి సమయంలో కోల్పోతే ఆ రాష్ట్రానికి కూడా అంతే నష్టం.. ఇకపోతే క‌రోనాను నియంత్రించాలంటే సామాజిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. కానీ తప్పని పరిస్దితి డాక్ట‌ర్లు మాత్రం క‌రోనా రోగుల‌ను ప్ర‌తీ రోజు ప‌ర్య‌వేక్షించాల్సి వ‌స్తుంది. రోగులకు కావాల్సిన మందులు, ఆహారం ఇవ్వాలంటే వారి దగ్గ‌రకు వెళ్లాలి. ఈ ప‌నుల నుంచి మెడిక‌ల్ స్టాఫ్‌కు కొంత విముక్తి క‌ల్పించేందుకు కొన్ని చోట్ల రోబోలను రంగంలోకి దించారు. కొన్ని కొన్ని ఆస్ప‌త్రిలో రోబో సాయంతో మందులు, ఆహారాన్ని రోగుల‌కు అందిస్తున్నారు వైద్యులు. ఆస్ప‌త్రి సిబ్బందికి క‌రోనా బారి నుంచి  దూరంగా ఉండేందుకు సామాజిక దూరం ఉండేలా ఈ రోబో ఉప‌యోగ‌ప‌డుతుంది..

 

 

ఇక ఈ రోబోలను విదేశాల్లో దాదాపు అన్ని కరోనా వార్డ్‌ల్లో వాడుతుండగా మనదేశంలో కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే ఈ కరోనా సమయంలో ప్రపంచ మేధావులందరు మరింత అడ్వాన్స్‌గా ఆలోచించవలసిన అవసరం ఉందని తెలుస్తుంది. ఒక రకంగా కరోనా సమస్త మానవాళికి గుణపాఠాన్ని నేర్పింది. ఒక ఓటమి నుండి ఎన్నో విజయాలను సాధించవచ్చు.. ఆ దిశగా ఆలోచించి ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు తలెత్తితే వాటిని గ్రహించి సమర్ధవంతగా ఎదుర్కొనే వ్యవస్దను ప్రపంచం నిర్మించుకోవాలి లేదంటే ఊహించని విధంగా ప్రాణ నష్టాలు చరిత్రలో జ్ఞాపకాలుగా మిగులుతాయి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: