మంచి విలువ అనేదు అంత త్వరగా బయటపడదు.. అప్పటి వరకు చెడునే అందరు నమ్మేస్తారు.. ఎందుకంటే బంగారం ఎంతో విలువైంది.. అది భూమి అడుగు భాగంలో మట్టిలో దాక్కొని ఉంటుంది.. దాన్ని బయటకు తీసి శుద్ధి చేస్తే గాని విలువను సంతరించుకోదు.. కాని అది బయటపడేవరకు మట్టినే తవ్వుకుంటూ వెళ్ళాలి కదా.. ఇక లోకంలో వైద్యులు దేవుళ్లు అని ఎంతోమంది అంటుండగా ఇన్నాళ్లు విన్నాము.. అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము.. ఎందుకంటే ప్రస్తుత పరిస్దితుల్లో కరోనా మహమ్మారి బారిన పడ్డవారిని కాపాడే ఏకైక దేవుడు వైద్యుడే అని లోకం కీర్తిస్తుంది..

 

 

అదీగాక ఈ కరోనా సంక్షోభంలోంచి బయట పడాలంటే వారికి తోడుగా పోలీసులు, పారిశుద్య కార్మికులు చెరోవైపు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఆపదకాలంలో వారి సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, కొందరు మూర్ఖులు వీరిపట్ల చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నారని వైద్యులపై దాడులు చేయడమే కాకుండా, వారున్న అద్దె ఇళ్లను ఖాళీ చేయండని వేధించడం వంటి అమానవీయ ఘటనలు చూస్తున్నాం... ఇక ఎలాంటి జాలి, దయ, మచ్చుకైన మానవత్వం లేని మనుషులు ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ గారు షేర్ చేశారు.

 

 

‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. ఇది భారతదేశం ఆత్మ. మనం ధైర్యంగా కోవిడ్‌-19 తో పోరాడుతున్నాం. ముందుండి పనిచేసేవారంటే మనకెంతో గర్వకారణం’ అని మోదీ పేర్కొన్నారు. ఇకపోతే ఇక్కడ మనకు కనిపిస్తున్న వీడియోలో ఉన్నది ఒక వైద్యురాలు.. ఈ మేడం గారు నిర్విరామంగా 20 రోజుల పాటు ఐసీయూలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందించి.. ఇంటికి తిరిగొచ్చారు. ఆమె వచ్చిన సందర్భంగా ఈ వైద్యురాలు గేటు ముందుకు రాగానే అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారంతా కిందకు వచ్చారు. చప్పట్లు, ప్లకార్డులతో ఊహించని విధంగా ఆమెను స్వాగతించారు.

 

 

మీ సేవలు ఎప్పటికీ మరిచిపోలేం అంటూ అభినందించగా.. ఆ వైద్యురాలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మహిళా వైద్యురాలిపై వారంతా చూపిన అభిమానం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. సమాజంలో వైద్యులంటే ఉన్న చులకన భావనను ఇప్పటికైనా కొందరు తగ్గించుకోవాలి. ఈ సమయంలో వారే లేకుంటే లోకం మొత్తం వల్లకాడు అయ్యేది.. అందుకే వైద్యులను గౌరవించడం నేర్చుకోండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: