లోకంలో ప్రేమ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు.. ఇది ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది.. స్వచ్చమైన మనసుకు ఆనందం కలిగించేదే నిర్మలమైన ప్రేమ అని అంటారు.. ఈ ప్రేమను పంచడంలో మనుషులకంటే జంతువులే ముందుంటాయి.. మానవులు పంచే ప్రేమలో స్వార్ధం నిండి ఉంటుందేమో గానీ.. జంతువులు, పక్షులు పంచే ప్రేమ హిమం కంటే చల్లగా, పాలకంటే తెల్లగా ఉంటుంది.. ఎందుకంటే వాటికి కుట్రలు కుతంత్రాలు తెలియవు కదా.. అందుకే అంటారు ఒంటరిగా ఉన్నానని బాధపడే బదులు ఒక కుక్కను పెంచుకుంటే కడవరకు విడిపోకుండా విశ్వాసంతో ఉంటుందని..

 

 

ఇకపోతే ప్రేమలో ఉన్న మాధుర్యం కౌగిలింతలో దాగి ఉంటుంది.. నిజంగా ఎవరైన బాధలో ఉన్నప్పుడు వారిని హగ్ చేసుకుని ఇచ్చే ఓదార్పు ముందు ఏవైన చిన్నవిగానే కనిపిస్తుంది.. పసితనంలో పిల్లలు ఏడుస్తుంటే తల్లి తన ఒడిలోకి ఆ పిల్లవాన్ని తీసుకుని గట్టిగా హత్తుకుని ఊరడించుతుంది.. అప్పుడు ఆ పసివానికి తన తల్లికంటే గొప్ప ప్రపంచం మరేదిలేదనే భరోసా కలుగుతుంది.. అందుకే ప్రేమగా ఇచ్చే హగ్ లో ఉన్న మాధుర్యం దేనిలో కూడా ఉండదు అనేది వాస్తవం. ఇకపోతే ఆనందం ఎక్కువైనా, విషాధం భరించలేని సమయంలో కూడా ఒకరికి ఒకరు హత్తుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. అయితే ఇలాగే హగ్ ఇచ్చుకుని ఒకదానిని ఒకటి ఓదార్చుకుంటున్న జంట కోతులను చూస్తే అయ్యోపాపం వీటికి ఏం కష్టం వచ్చిందో అని అనుకోని వారుండరు..

 

 

ఈ వీడియోలో  ఒక కోతి మరో కోతికి హగ్ ఇస్తుంది. గట్టిగా పట్టుకుని ఏడ్చినట్లుగా కనిపిస్తుంది.. మనుషుల వలె అవి కూడా ఇలా భావోద్వేగాలు పలికించుకుంటు తమ గోడును చెప్పుకుంటున్నాయి.. దీనికి సంబంధించిన వీడియో అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.. కాగా ఏ మనిషికి అయినా ఎదుటి మనిషి ఒక ధైర్యం అని.. అలాంటి ధైర్యాన్ని మనం వాళ్లకు ఇస్తే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం ఇచ్చినట్టు అవుతుంది అంటూ పలువురు ఈ వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు... జీవితంలో ఆస్తులు పంచితే కరిగిపోతాయి.. కానీ ప్రేమ మాత్రం పంచే కొద్ది పెరుగుతుంది.. ఏ క్షణం మరణిస్తామో తెలియని బ్రతుకులో.. బ్రతికినంత కాలం ప్రేమను పంచుతూ జీవిస్తే చచ్చాక కూడా మనం పంచిన ప్రేమ ఈ లోకంలో బ్రతికే ఉంటుంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: