లోకంలో రోజు రోజుకు మనుషులు సిగ్గు విడిచి ప్రవర్తిస్తున్నారనడానికి ఈ మధ్యకాలంలో వస్తున్న టిక్‌టాక్‌లను చూస్తే అర్ధం అవుతుంది.. ఈ టిక్‌టాక్‌ పైత్యం మానవుల మెదళ్లోకి పూర్తిగా చొచ్చుకుపోయింది.. మద్యానికి ఎలా బానిసగా మారారో, ఈ టిక్‌టాక్‌లకు కూడా అంతకంటే ఎక్కువగా బానిసలయ్యారు మనుషులు.. ఈ మధ్యకాలంలో టిక్‌టాక్‌ల జోరు విపరీతంగా ఊపందుకుంది.. అందులో లాక్‌డౌన్ నేపధ్యంలో ప్రతి వారు పిచ్చి పిచ్చి టిక్‌టాక్‌లను సోషల్ మీడియాలో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు..

 

 

ఇదిలా ఉండగా బొత్తిగా మెదడులేని వారు కొందరు ఒక కొత్త టిక్‌టాక్‌ను కనిపెట్టారు.. అదేంటో తెలిస్తే ఛీ అని ఉమ్మేస్తారు.. చెప్పడానికే అసహ్యంగా ఉంది ఇక చూస్తుంటే ఎలా ఉంటుందో తెలియదు గానీ, ఈ దరిద్రమైన టిక్‌టాక్‌ పేరు "పీ యువర్ పాంట్స్ చాలెంజ్".. అంటే చెడ్దిలో మూత్రం పోసుకోవడం అన్న మాట.. కామన్‌గా చిన్న పిల్లలు, మతిస్దిమితం లేని వారు ఇలాంటి పనులు చేస్తారు.. కానీ ఇక్కడ ఈ చాలెంజ్ స్వీకరించిన వారు అన్ని సక్రమంగా ఉన్న వారే.. మరి ఈ దరిద్రమైన చాలెంజ్ చూస్తేనే మనకైతే కడుపులో దేవినట్లుగా ఉంటుంది.. మరి వీరు నవ్వుకుంటూ టిక్‌టాక్‌ చేస్తున్నారు.. ఇకపోతే ఇప్పటి వరకు ప్రజలంతా కొత్త కొత్త వంటకాలు తయారు చేయడం, ఇంటి పనులు చేయడం వంటి ఛాలెంజులే వేసుకున్నారు. అమ్మాయిలైతే పిల్లో ఛాలెంజ్, షాపింగ్ బ్యాగ్ ఛాలెంజ్‌ అంటూ కాలం గడిపారు. కానీ, ఈ ‘మూత్రం’ ఛాలెంజే చాలా ఎబ్బెట్టుగా, దరిద్రంగా, చెండాలంగా ఉంది.

 

 

ఇక ఈ చెత్త చాలెంజ్‌ను మొదట ప్రారంభించింది అమెరికాకు చెందిన లియం వెయర్ అనే 19 ఏళ్ల సినీ నిర్మాత, కమెడియన్ అని చెబుతున్నారు.. ఇదిలా ఉండగా మూత్రం పోసేప్పుడు వాళ్ల ముఖంలో కనిపించే ఎక్స్‌ప్రెషన్స్‌ను చూసేందుకే ఈ ఛాలెంజ్ విసురుతున్నారట. ఇక్కడ మరో చిత్రమైన విషయం ఏంటంటే చివరికి అమ్మాయిలు కూడా.. మేము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లుగా ప్యాంట్లలో మూత్రం పోస్తూ వీడియోలు పెడుతున్నారు. కాగా ఈ వీడియోలు చూసిన నెటిజన్స్ తలలు బాదుకుంటున్నారు.. నిజానికి ఇంత దరిద్రమైన టిక్‌టాక్ జీవితంలో చూసి ఉండరు అంటూ వీళ్లకు పిచ్చి చాలా ముదిరిందని గగ్గోలు పెడుతున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: