నటసింహ నందమూరి బాలకృష్ణ నటనలోనే కాదు, అభిమానులను దడ దడలాడించడంలో కూడా సింహమే.. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తల విషయంలో కూడా పెద్దపులిలా గర్జించాడు అన్న టాక్ ఉంది.. అందుకే కావచ్చు బాలయ్యకు వీలైనంత దూరంలో ఉండటం మంచిదని చాల మంది అనుకుంటారట.. సింహం దగ్గరికి వెళ్లాలంటే ఎలా ఆలోచిస్తారో, బాలయ్య దగ్గరికి వెళ్లాలంటే కూడా అంతకంటే ఎక్కువగా భయపడతారట.. ఇకపోతే తెరపైన బాలయ్య మాటలు తూటాల్లా పేలుతుంటాయి.. వడగళ్ల వానకు అయినా కాస్త విరామం ఉంటుందేమో కాని బాలయ్య డైలాగులు వదిలారంటే.. అభిమానుల గుండెల్లో ఆనందానికి, వారు వేసే ఈలలకు హద్దు అదుపు ఉండదు..

 

 

ఒకరకంగా సినిమాలో డైలాగులు వదలడంలో అణుబాంబు లాంటి వారు బాలయ్య.. అదే నిజ జీవితంలో మాత్రం మాట్లాడుతుంటే తడబడుతాడనే విషయం అందరికి తెలిసిందే ఇలాంటి బాలయ్య తనపైన ఉన్న అనుమానాలను పటా పంచలు చేస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఇంతకు విషయం ఏంటంటే.. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన విష్ణువర్ధన్ రెడ్డి గారి 50 వ పుట్టినరోజు సందర్భంగా, నటుడు, హిందూపురం ఎంఏల్ఏ అయిన బాలకృష్ణ అతనికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు..

 

 

అందులో యుక్త వయసులోనే అనేక కంపెనీలు నెలకొల్పి యువతకు ఆదర్శంగా నిలిచిన విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు మరిన్ని పుట్టినరోజులు ఘనంగా జరుపుకునేందుకు ఆ దేవుడి ఆశీస్సులు నిత్యం ఉండాలంటూ బాలకృష్ణ పేర్కొన్నారు.. ఇందులో ఆశ్చర్యం ఏముందనుకుంటున్నారా.. ఈ విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడటంతో బాలయ్య అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారట.. అది కూడా మంచి టైమింగ్, రైమింగ్‌తో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇకపోతే బాలయ్య మాటలు విన్న నెటిజన్స్ ‘వావ్, భలే మాట్లాడాడు’, ‘బాలయ్య ఇంగ్లీష్ ఇరగదీశాడు’, ‘బాలకృష్ణ ఇంగ్లీష్ ఇంత అద్భుతంగా మాట్లాడుతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారట... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: