ఎవరైన రోడ్డు మీద వెళ్లుతున్నప్పుడు అకస్మాత్తుగా మీ ముందు ఉన్న వాహనం గాల్లో లేచి అల్లంత దూరంలో పడిపోతే దాన్ని చూసిన వారి ప్రాణాలు అరచేతిలోకి వస్తాయని చెప్పవచ్చు.. కామన్‌గా కళ్లముందు, రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగితేనే కొందరు కళ్లు తిరిగి పడిపోతారు.. మరికొందరు భయంతో పరుగులు పెడతారు.. అసలు ఇలాంటి దృశ్యం కనిపిస్తే అది చూసిన వారు షాక్‌తో బిగుసుకు పోతారు.. దాని నుండి కోలుకోవడానికి కొంత సమయం కూడా పడుతుంది.. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కూడా ఇలాంటి సంఘటనే కనిపిస్తుంది.. ఇది మాయనో, దెయ్యం చేసిన పనో అని కొందరైతే తర్జభర్జనలు కూడా పడతారు..

 

 

కానీ ఇక్కడ జరిగిన ఘటనకు మాత్రం భయస్తులైతే గుండే ఆగి చావడం ఖాయం. ఇంతకు ఏం జరిగిందంటే.. చైనాలో ఉన్న ఒక రోడ్దులో వాహనాలన్ని యధాతదంగా వెళ్లుతున్నాయి. అయితే రెడ్ సిగ్నల్ పడటంతో ఒక వైపు వెళ్ళుతున్న వాహనాలు ఆగి ఉన్నాయి.. అప్పుడు సిగ్నల్ ముందు లైనులో ఉన్న ఒక ట్రక్కు మాత్రం అకస్మాత్తుగా గాల్లోకి లేచి, గిరగిరా తిరుగుతూ పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌ పై ఎగిరిపడింది. దాని వెనక ఉన్న వాహనాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అంతే కాదు ఆ ట్రక్కుతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలుచున్న వాహనాలకు ఏమీ కాలేదు. కానీ, ఈ ట్రక్కు మాత్రమే దెయ్యం పట్టినట్లు గిరగిరా తిరిగింది.

 

 

ఇక ఈ దృశ్యాన్ని చూస్తే మాత్రం ఎన్నో ఊహించుకుంటారు.. కానీ ఇక్కడ ఎలాంటి మాయ జరగలేదని, ఏ మ్యాజిక్కు లేదని, కేవలం ఈదురు గాలుల ప్రభావం వల్లే ఆ ట్రక్కు అలా ఎగిరిపోయిందని అధికారులు పేర్కొంటున్నారు.. ఎందుకంటే ఆ ట్రక్కు బరువు 1.8 టన్నులు మాత్రమే ఉండగా, అందులో ఎలాంటి వస్తువులు లేకపోవడం వల్ల తేలిగ్గా గాల్లోకి లేచిపోయిందని వివరిస్తున్నారు... ఇకపోతే ఇదంతా అక్కడి రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డవగా, దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ప్రస్తుతం వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.. ఏది ఏమైనా వీరు చెప్పిన నిజం నమ్మేలా ఉందా అని అనుకుంటున్నారట.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: