అదేంటో గాని కొందరికి పిచ్చి మామూలుగా ఉండదు.. ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చిందంటే.. మంచి ఉద్యోగం బుద్ధిగా చేసుకోక తనకు అవసరం లేని ఫోజు కొడదామని ప్రయత్నించాడు.. అసలే పోలీసు ఉద్యోగం అందులో కరోనా వల్ల ఈ ఉద్యోగాలు కత్తి మీద సాములా  మారాయి.. ఈ సమయంలో ప్రజలకు నీతులు చెబుతు, వినని వారిని తగిన రీతిగా శిక్షిస్తున్న పోలీసుల మీద మిగతా వారి కళ్లు మామూలుగా ఉండవు.. ఇలాంటి సమయంలో నలుగురికి ఆదర్శంగా ఉండవలసింది పోయి.. తానే బాలీవుడ్ హీరో అయితే ఎలా ఉంటుందని అనుకున్నాడు కావచ్చూ ఈ ఎస్సై..

 

 

ఆ ఆలోచన మెదడులో తట్టిందే ఆలస్యం.. కానిస్టేబుల్స్‌తో రెండు కార్లు తెప్పించుకున్నాడు.. ఆ రెండు కార్ల మీద అటో కాలు ఇటో కాలు వేసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆన్ చేసాడు.. ఇంతకు ఆ మ్యూజిక్ ఎవరిదో తెలుసా.. బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ ఫిలిం సింగం.. ఈ సినిమాలోని ఓ పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా.. మనోజ్ యాదవ్ స్టైల్‌గా స్టంట్ చేశాడు. చేస్తే ఏముంది అని అనకండి... ఖాకీ డ్రెస్ లోనే ఈ తతంగమంతా చేశాడు..

 

 

ఇతరులకు మార్గదర్శకంగా ఉండవలసిన ఒక ఆఫీసర్ ఇలా చేయడం చర్చకు దారి తీసింది.. అంతే కాకుండా ఇతను చేసిన నిర్వాకానికి ఉన్నతాధికారులు నోరెళ్లబెట్టారు.. ఇదే కాకుండా వెంటనే ఉన్నతాధికారులు రెస్పాండ్ అయ్యారు. ఎస్పీ ఆఫీసులో వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఐజీ సాగర్ అనీల్ శర్మ ఆదేశించారు. దీనికి సంబంధించి.. షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. కానీ చివరికి గట్టిగా మందలించి రూ.5000 ఫైన్‌ వేసి, మరోసారి ఇలా చేస్తే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట.. ఇకపోతే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్ జిల్లాలో జరిగిందట... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: