ఈ కాలం పిల్లలు మరి గడుగ్గాయిల్లా తయారవుతున్నారని మన పెద్దలు పిల్లల్ని వర్ణించడం తెలిసిందే.. అవును ఇది నిజమే కదా.. అమ్మ కడుపులో నుండి భూమి మీద పడగానే వాళ్ల పిల్ల చేష్టలు మొదలవుతాయి.. క్రమ క్రమంగా వారు చేసే అల్లరి చూస్తుంటే కన్నవారి హృదయం ఎక్కడో విహరిస్తుంది.. పట్టలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది.. మనం తరచుగా వింటుంటాం మన స్నేహితులు గానీ, బందువులు గాని పదే పదే ఒక మాట చెప్పడం.. అదేమంటే అబ్బా మా పిల్లాడు పుట్టి ఆర్నెళ్లు అయినా కాలేదండీ అప్పుడే వాడికి ఎన్ని తెలివి తేటలు, ఇలాంటి పిల్లల్ని నేనెప్పుడు చూడలేదని ఒకరంటే.. మా అమ్మాయి ఉంది చూడండి అది చేసే అల్లరికి మాకు సమయమే సరిపోవడం లేదంటే నమ్మండి, అసలు రోజులు తెలియకుండానే గడుస్తున్నాయి అని మరోకరు అంటారు..

 

 

అయితే ఒక వయస్సు వచ్చే వరకు పిల్లల అల్లరికి అందరు మురిసిపోతారు.. అదే కాస్త పెద్దవారు అయిన తర్వాత కూడా ఇలాగే అల్లరి చేస్తే.. అబ్బా ఈ పిల్లాడంత తీట పోరడు లేడని చివాట్లు పెడతారు.. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఒక ఘటనాలో మాత్రం బుడతడు చిన్నోడే కానీ చికాకు తెప్పించిన తల్లిదండ్రులను, టీచర్ను ఒక ఆట ఆడుకున్నాడు.. ఇక ఈ క్రింది వీడియోలో చూస్తే.. పంజాబ్ లోని గుర్దాస్ పూర్ లో ఉంటున్న ఎనిమిదేళ్ల పసివాడు, తనకు పెద్ద ఆపద వచ్చిందని, దాని నుండి కాపాడేందుకు వెంటనే రావాలని 100 నంబరుకు డయల్ చేసి పేర్కొన్నాడట..

 

 

వెంటనే స్పందించిన పోలీసులు వాడికి ఎలాంటి ప్రమాదం ఎదురైందో అని ఆ బుడ్డోడి ఇంటికి వెళ్ళి విచారించగా దానికి ఆ గడుగ్గాయి.. ఈ లాక్ డౌన్ లో కూడా తనను ట్యూషన్ వెళ్లమని తన తల్లిదండ్రులు బలవంత పెడుతున్నారని ఫిర్యాదు చేశాడట... అంతే కాకుండా పోలీసులను వెంటబెట్టుకుని ట్యూషన్ సర్ ఇంటికి తీసుకెళ్లగా, ఆ ట్యూషన్ టీచర్‌కు పోలీసులు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదే గాక లాక్ డౌన్ ముగిసే దాకా ట్యూషన్లు చెప్పడానికి వీల్లేదని హెచ్చరించారు.. ఇటు తల్లిదండ్రులకు, అటు ట్యూషన్ టీచర్‌కు పోలీసులతో చిన్న కోటా ఇప్పించిన వీడిని చూసి ఏమనాలో మీరే తేల్చుకోండి.. నేటికాలం పిల్లల మజాకా.. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి పిల్లలతో అంటున్నారు నెటిజన్స్.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: