ప్రపంచంలో కరోనా వల్ల మనుషులకు ఉన్న స్వేచ్చ దాదాపుగా నశించిందని చెప్పవచ్చూ.. ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేసినా కరోనా మనచుట్టే ఉంటుంది.. ఈ విషయంలో మన నిత్య జీవితంలో ఆచరించే జీవన విధానంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం ఈ భూమిమీద బ్రతికే అర్హతను కోల్పోతాం.. అందుకే ఇది వరకటిలా జీవిస్తాం అంటే కుదరదు.. ఎందుకంటే ఈ సారి కరోనా ప్రజల్లో ఒక కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది.. అది ఎవరితో ఎప్పుడు ఎక్కడ స్నేహం చేస్తుందో తెలియదు.. ఇకపోతే ప్రస్తుతం గుంపులుగా ఉండక పోవడం, ఎక్కడకు వెళ్లిన సోషల్ డిస్టెన్స్ పాటించడం, ముఖ్యంగా చేతులను స్సానిటైజర్ తో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, ముఖాన్ని మాస్క్‌తో కవర్ చేయడం మన దిన చర్యలో భాగంగా మార్చుకోవడం తప్పని సరి..

 

 

ఇక గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ కారణంగా సెలూన్ షాపులు మూతపడిన సంగతి తెల్సిందే. దీని వల్ల ఒక్కొక్కరు తమ జుట్టును, గడ్డాలను విపరీతంగా పెంచేసుకున్నారు..  అయితే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన లాక్ డౌన్ సడలింపుల్లో సెలూన్ షాపులు తెరచుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ కరోనా భయంతో కొందరు ప్రజలు సెలూన్ షాపులకు వెళ్లడం లేదు. ఇంట్లోనే కటింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చక్కగా కటింగ్ చేసుకోలేక పోతున్నారు.. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఇంట్లోనే సులభంగా కటింగ్‌ ఎలా చేసుకోవాలో ఆ వ్యక్తి స్టెప్‌ బై స్టెప్‌ వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు. ఆ వివరాలు చూస్తే..

 

 

ముందుగా ఒక న్యూస్‌ పేపర్‌ తీసుకొని దాన్ని మధ్యలో గుండ్రంగా కట్‌ చేసుకుని ఆ రంధ్రం ద్వారా తలని దూర్చాల్చి, ఇది జుట్టు మీ శరీరంపై పడకుండా క్లాత్‌ మాదిరిగా ఉంటుంది.. ఆ తర్వాత ఒక దువ్వెన, కొత్త బ్లేడ్‌, క్లిప్‌ తీసుకుని, వీడియోలో చూపించిన విధంగా దువ్వెన, బ్లేడ్‌ను హెచ్చు తగ్గులుగా పెట్టి క్లిప్‌ని అటాచ్‌ చేయాలి. అలా గట్టిగా ఫిక్స్‌ చేసిన తర్వాత హెయిర్‌‌ దువ్వుకున్నట్లుగా దువ్వుకుంటే పెరిగిన జుట్టంతా బ్లేడ్‌కు వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ ఆ వ్యక్తి తానంతట తానే హెయిర్‌కట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సెలూన్ షాప్స్ అంటే భయడేవారికి ఈ విధానం నచ్చితే జాగ్రత్తగా ప్రయత్నించుకోవచ్చట..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: