కరోనా వచ్చి ఈ బ్రతుకులను చిద్రం చేసింది.. దీని వల్ల ఎందరో పడరాని పాట్లు పడుతున్నారు.. ఇదంతా ఒకెత్తు అయితే ఉపాధికోసం పొట్ట చేతబట్టుకుని  నగారాలకు వెళ్లి, లాక్ డౌన్‌లో బతుకు భారమై ఇళ్లకు చేరుతున్న వలస కూలీలపై చేస్తున్న దుర్మార్గాలకు తెరపడ్డం లేదు. కొందరైతే వారిని జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు.. ఇక అధికారులు వారేదో అంటరాని రోగాన్ని వెంట తెచ్చుకున్నట్లుగా వారిపై చేస్తున్న పిచికారీలను ఆపడం లేదు. ఈ విషయంలో కోర్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, దేశంలో ఎక్కడో ఒక చోట వారిపై ప్రమాదకర మందులను స్ప్రే చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు తరచుగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి..

 

 

ఇకపోతే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి దారుణం జరిగింది. అదేమంటే శ్రామిక్‌ రైలులో వచ్చిన వలస కూలీలు కరోనా పరీక్షల కోసం లజ్‌పత్‌ నగర్‌ స్కూలు వద్దకు చేరుకున్నారు. అయితే వారిని చూడగానే అక్కడున్న మునిసిపల్ సిబ్బంది, ఒక్క సారిగా కెమికల్ స్ప్రే నూ వారిపై చేశారు. ఇకపోతే అక్కడున్న పోలీసులు కూడా బొమ్మలా చూస్తుండిపోయారే తప్పితే వారిని నివారించలేదు.. కూలీలు అంటే వారుకూడా మనుషులే కదా, అసలే కరోనా సమయంలో తిండి నిద్ర సరిగా లేక లోలోపల అనారోగ్యంగా ఉన్నా సొంత ఊరికి చేరుకుంటే చాలని ఊపిరి బిగపట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు..

 

 

ఇలాంటి సమయంలో వారిని ఇంకా అనారోగ్యాలకు గురి చేస్తున్నారు కొందరు.. అసలే రసాయన పిచికారీ వల్ల శ్వాసకోశాలు దెబ్బతిని, చర్మవ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇక ఈ ఘటనపై ఢిల్లీ అధికారులు వెర్రి వివరణలు ఇస్తున్నారు. కాగా మనకు కనిపిస్తున్న వీడియోలో మునిసిపల్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే కూలీలపై స్ప్రే చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపించడంతో మాట మార్చి తమ వాళ్లు పొరపాటు చేశారని అంటున్నారు ఆ శాఖ తాలుకు అధికారులు.. ఇక ప్రస్తుతం ఈ వీడియో బయటికి రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: