లోకంలో ఊసరవెళ్లి ఎన్ని రంగులు మారుస్తుందో అలాగే మనుషుల్లో ఉన్న పుర్రెలో వివిధ రకాలైన ఆలోచనలు ఉంటాయని తెలిసిందే.. అందుకే అంటారు మనపెద్దలు పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని.. కొంతమంది ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటే, మరికొంత మంది ప్రవర్తించే విధానం భయంకరంగా ఉంటుంది.. అది ఎంతలా అంటే ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో కనిపిస్తున్నట్లుగా.. ఒక్కోక్కరికి ఉన్న అలవాట్లు అసలు ఊహించడం చాలా కష్టం.. అలాగే దక్షిణ కొరియలోని, సియోల్‌‌లో ఓ వ్యక్తికీ ఉన్న వింత అలవాటు చూస్తే మాత్రం ఇది వెర్రి అనాలో, పిచ్చి అనాలో అర్ధం కాదు.. కానీ అతను ఈ అలవాటుకు మాత్రం ఒక సమాధానం చెబుతాడు.. ఇక అది నమ్మిన నమ్మక పోయినా మనకైతే తెలియదు కదా.. అందుకే నమ్మితే నమ్మండి లేకపోతే లేదు..

 

 

ఇకపోతే ఇతనికి ఉన్న వింత అలవాటు ఏంటంటే గత ఐదేళ్లుగా ఈ వ్యక్తి అతని తలను చెట్టుకేసి రక్తం వచ్చేలా బాదుకుంటున్నాడట.. వింటుంటే వింతంగా అనిపిస్తుంది కదా.. ఈ వ్యక్తి చేసే పనివల్ల చాలా ఫేమస్ కూడా అయ్యాడట.. కానీ ఇతని వృత్తి మాత్రం చెప్పులు కుట్టడం.. ఇక ఇతన్ని ఎవరూ పేరుతో పిలవరట. కేవలం చెట్టును కొట్టుకొనే వ్యక్తే అని అంటారట. అందుకే, అక్కడ మీడియా కూడా ఆ వ్యక్తిని అలాగే పిలుస్తోంది. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో అతడు చేస్తున్న పని గురించి ప్రపంచమంతా తెలిసింది. అతడు రోజూ తన చెప్పుల దుకాణం తెరిచే ముందు మార్గ మధ్యలో ఉన్న చెట్టుకు తలను బాదుకుంటాడట. అంతే కాకుండా తన శరీరంతో కూడా చెట్టును బలంగా ఢీకొడతాడట. అయితే, అతడు ఎందుకలా చేస్తున్నాడనేది ఎవరికీ అర్థం కాలేదు. గత ఐదేళ్లుగా అతడు.. అదే పనిగా చెట్టుకేసి తలను బాదుకుంటున్నాడని స్దానికులు చెబుతున్నారు..

 

 

ఈ క్రమంలో అతని తలకు గాయం అయ్యి రక్తం కారుతున్న తాను చేసే పని మాత్రం ఆపడు, అంతే కాదు ఆ గాయానికి మందు రాసి మరునాడు కూడా ఇలాగే ప్రవర్తిస్తాడట.. అయితే ఇదంతా అతడు పిచ్చెక్కి చేయడం లేదని, అది ఒకరమైన వ్యాయామం అని తెలిసింది.. ఇదిలా ఉండగా ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. వ్యాయామం సంగతి పక్కన పెడితే తలను గాయపరుచుకోవడం వల్ల మెదడుకు గాయాలయ్యే ప్రమాదం ఉందని, ఇలాంటి పనికి మాలిన పనిని మానుకోకుంటే హస్పిటల్‌కు వెళ్లడం ఖాయమని హెచ్చరిస్తున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: