దేశంలో నేరప్రవృత్తిని పెంచుతున్న టిక్‌టాక్ పై ఇప్పటికే వ్యతిరేకత మొదలైందన్న విషయం తెలిసిందే.. ఈ టిక్‌టాక్ చాటున మనుషులు మానవత్వాన్ని మరచిపోతున్నారు.. కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటుండగా, మరికొందరు నోరులేని మూగ జీవాలను హింసిస్తూ వాటి మరణాలకు కారణం అవుతున్నారు.. ఇలాంటి దొంగ వెధవలను, దరిద్రపు పుండాకోరులను ముక్కలు ముక్కలుగా చీల్చి కాకులకు గద్దలకు వేసిన పాపం లేదని ఒక వీడియో చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే దేశంలో టిక్ టాక్ వీడియోలను అడ్డం పెట్టుకుని కొందరు మతపరమైన విద్వేషాలను, జంతు హింసను, అత్యాచారాలను ప్రోత్సహిస్తున్నారని, ఈ నేపథ్యంలో టిక్ టాక్ అప్లికేషన్ ను నిషేధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

 

 

ఇకపోతే ఇద్దరు యువకులు అత్యంత దారుణానికి తెగబడ్దారు.. అదేమంటే ఆ యువకులు ఓ కుక్క కాళ్లను తాడుతో కట్టి చెరువులోకి విసిరేస్తారు. దీంతో తన ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ కుక్క ప్రయత్నం చేయగా గట్టున ఉన్న ఆ ఆకతాయిలు రాళ్లతో కుక్కని కొట్టారు. ఒకవైపు బ్రతకాలని ఆరాటపడుతుండగా మరోవైపు తాళ్లతో కాళ్లకు బరువులు కట్టి చెరువులో పడేసిన ఆ కుక్క మునిగిపోతుండగా జాలిలేకుండా నిర్దాక్షిణ్యంగా రాళ్లతో కొట్టి చంపడం ఆ రాక్షసుల నేరప్రవృత్తికి నిదర్శనంగా కనిపిస్తుంది.. ఇలాంటి వారు సమాజానికి చీడ పురుగుల్లా తప్పక తయారవుతారని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.. ఇకపోతే ఈ దుశ్చర్యకు సంబంధించిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

 

కాగా ఈ వీడియోపై పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఆ యువకుల్ని పట్టి ఇచ్చినవారికి 50 వేల రూపాయల నజరానా ప్రకటించింది. ఒకవేళ ఈ వెధవల వివరాలు తెలిసిన వాళ్ళు ’91 9820122602′ మొబైల్ నంబర్ కు లేదంటే e-mail Info@petaindia.org  లకు నేరుగా సమాచారం ఇవ్వాలని కోరింది.  ఇకపోతే ఆ ఆకతాయిల సమాచారం తెలిపిన వ్యక్తులకు ఎటువంటి హాని జరగకుండా వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తుంది.. ఇక నేటి బాలలే రేపటి పౌరులు అన్నది పాత సామేతగా మారింది.. ఇలాంటి వెధవలే రేపటి కరుడుగట్టిన నేరస్తులు అని అనవలసి వస్తుంది..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: