మనిషికి, పశువుకు అయిన ఓపిక అనేది ఉండవలసినంత ఉంటుంది.. అది నశించిందంటే ఎవరి మాట వినడం అంటూ ఉండదు.. అందుకే ఏదైనా ఒక హద్దు వరకే, అయితే ఓపికగా ఉంటున్నారని వారి ఓపికకు పరీక్ష పెడితే దాని పర్యావసనం ఎలా ఉంటుందో చాల తక్కువ మందికి మాత్రమే అర్ధం అవుతుంది.. ఈ విషయం అందరికి అర్ధం అయితే లోకంలో మనుషులు సాటి మనుషుల్ని గౌరవించే వారు.. అది లేదు కాబట్టే ఇన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. అహం అనేది నిలువునా ఆవహించగా, నేను బాగుంటే చాలు అనే స్వార్ధం దాదాపుగా లోకంలో నిండిపోయింది.. కానీ దీనికి తగిన ఫలితం ఇదిగో ఇక్కడ చూస్తున్న వీడియోలో మాదిరిగా అనుభవించక తప్పదు..

 

 

అదేమంటే కొందరు ఆకతాయిలు ఎడ్ల బండికి గేదెల్ని తగిలించి ఒకరికొకరు పోటీపడుతూ, వారి సంతోషం కోసం ఆ మూగ జీవాల్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి హింసిస్తున్నారు.. మూగజీవి అయినా, చివరికి చిన్న జీవి అయినా ఓపిక నశించిందంటే తిరగబడుతుందన్న విషయం గ్రహించాలి.. ఈ మూర్ఖులు ఆ విషయాన్ని మరచినట్లు ఉన్నారు.. అందుకే ఆ గేదెను ఇష్టం వచ్చినట్లుగా కొట్టుతుండగా దానిలో ఉన్న సహనం నశించి ఈ గాడిదలకు సరైన బుద్ధి చెప్పింది.. అది అలా వేగంగా ముందుకు వెళ్లుతూ, రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ వైపు మళ్లీ దానిపై నుండి ఆ బండిని పోనిచ్చింది.. అంతే.. బండిపై ఉన్నవారు అల్లంత దూరం ఎగిరి కిందపడ్డారు.

 

 

ఇకపోతే అక్కడే ఉన్న కొంతమంది ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది వైరల్‌గా మారింది.. ఇక నెటిజన్లు వీడియో చూసి బర్రె బలే పగతీర్చుకుంది వాళ్లకి అంతేకావాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారట.. ఇక ఇందులో ఉన్న సారాంశం ఏంటంటే ఎవరికైనా సహనం అనేది హద్దు దాటనంత వరకే.. అదిగనుక చచ్చిపోతే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమౌతుంది. ప్రస్తుతం ఆ వీడియోకు 1.4 మిలియన్ వ్యూస్ రాగా, 43వేల మంది లైక్ చేశారట.. ఇక మనిషి అయినా పశువైనా అన్నీటిలో ఉన్న ప్రాణం ఒకటే.. అందుకే బాధ ఎవరికైనా బాధనే.. ఈ రోజు ఇతరులను ఎలా బాధపడేలా చేస్తున్నారో కొందరు, వారు కూడా ఏదో ఒకప్పుడు ఈ సమస్యను ఎదుర్కోక తప్పదు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: