మనిషి తన ప్రాణాలను లెక్కచేయకుండా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. తనకున్న పరిజ్ఞానంతో టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ తాను జీవించడానికి అనుకూలంగా మార్చు కుంటున్నాడు.. దశాబ్ధాల క్రితం మనిషి జీవించిన స్దితిగతులను, ఇప్పుడు జీవిస్తున్న విధానాన్ని పరిశీలిస్తే ఎంతో మార్పు.. అసలు ఊహించలేనంతగా, ఊహకే అందనంతగా.. కానీ ఎన్ని చేసిన, ఎంత ఉన్నతంగా జీవించాలని చూసిన ప్రకృతి నుండి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి..

 

 

అయినా పడిలేస్తున్నాడే గాని తన ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదు.. ఇప్పటికే పంచభూతాలలో ఒకటైన అగ్నిలో తప్ప మిగతా వాటిలో సులువుగా ప్రయాణించ గలిగేటంతటి టెక్నాలజీని సొంతం చేసుకున్నాడు.. అదీ గాక తన నిత్య జీవితంలో ఏ ప‌ని చేయాల‌న్నా మనిషికి టెక్నాల‌జీ ఎంతో స‌హాయం చేస్తున్న‌ది. ఇందులో భాగంగానే నేల‌పై సైకిల్ న‌డ‌ప‌డ‌మే కాకుండా ఏకంగా నీటిపై న‌డ‌ప‌గలిగే టెక్నాల‌జీని అభివృద్ధి చేశాడు..

 

 

చాల మందికి నీటి పై తేలుతూ సైకిల్ తొక్కాలని ఉంటుంది.. ఇలాంటి వారికి ఈ సైకిల్ ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగులుస్తుంది.. ఇకపోతే ఈ సైకిల్ కేవ‌లం 20 కేజీల అతి త‌క్కువ బ‌రువుతో నీటిపై తేలుతూ.. ముందుకు సాగి పోతుందట ఇక ఈ ఆక్వా సైకిల్‌ను రోడ్డుపై తొక్కిన‌ట్టుగానే నీటి మీద కూడా చాలా సుల‌భంగా ముందుకు సాగేలా  రూపొందించారట నిపుణులు.

 

 

ఇక ఇక్కడ వస్తున్న ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా  విషయం అర్ధం అవుతుంది.. కొత్తదనాన్ని కోరుకుంటున్న వారికి ఇలాంటి సైకిల్ పూర్తిగా సహకరిస్తుందని పేర్కొంటున్నారు.. ఏది ఏమైనా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ మనుషులు చేస్తున్న కృషికి మెచ్చుకోక తప్పదు.. కానీ తాను మనిషిని అన్న విషయమే మరచిపోతుండటం బాధాకరం అని అనుకుంటున్నారట.. ఇకపోతే ఈ వాటర్ సైకిల్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారి నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుందట.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: