పగ, ద్వేషం ప్రస్తుతం సమాజం నిండా నిండుకున్న పదాలు.. ఇవి మనుషుల్లోనే కాదు పశువుల్లో కూడా కనిపిస్తుంది.. అసలు ఒక మనిషిని అంతలా పగబట్టవలసిన అవసరం ఏముందంటే.. మనుషులైతే రకరకాలైన కారణాలు చెబుతారు. కానీ జంతువులు అలా చెప్పలేవు కానీ వాటికి కోపం వస్తే ఒక్కోసారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడవు.. ఇలా చేసినందుకు వాటి మీద ఎలాంటి కేసు ఉండదు.. అలాగే మనుషుల పై అంతగా కక్షకట్టడానికి కారణం తెలియదు.. కానీ ఒక్క మాట మనుషులు ద్వేషించినా, ప్రేమగా చూసిన అవి పశువులు కాబట్టి వాటిపట్ల జాగ్రత్త అవసరం..

 

 

ఇకపోతే అప్పుడప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే జంతువులు మనుషులపై పగబట్టిన తీరు.. వీళ్ల మధ్య ఎన్ని జన్మల వైరం ఉందో అని అనిపిస్తుంది.. ఎందుకంటే ఒక వ్యక్తిమీద కసితో రగిలిపోయే మనిషి తన పగను ఎలా తీర్చుకుంటాడో, అచ్చంగా పశువులు కూడా కొందరిపట్ల ఇలాగే ప్రవర్తిస్తాయి.. ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో అన్నెం పుణ్యం ఎరుగని ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి దారి వెంట వెళ్లుతుండగా ఎక్కడినుండి వచ్చిందో ఒక ఎద్దు అతన్ని చూడగానే రంకెలు వేస్తూ తనివితీరా కుమ్మేసింది..

 

 

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో జరిగింది.. అదేంటో తెలుసుకుంటే.. ఖాళీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన ఎద్దు అతడిని కిందపడేసి కొమ్ములతో కుమ్మేస్తుంది దాని నుండి తప్పించుకోవడానికి అతడు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు కానీ అతనులేస్తే చాలు వెనకా ముందు చూడకుండా దాడి చేస్తూనే ఉంది.. ఇంతలో అటుగా వస్తున్న ఓ వ్యక్తి తన సైకిల్‌ను అడ్డుపెట్టి అతడిని రక్షించే ప్రయత్నం చేసాడు, కానీ అతని ప్రయత్నం ఫలించలేదు.. ఇది జగమొండి ఎద్దులా ఉంది..

 

 

ఇతన్ని చూడగానే పాతజ్ఞాపకాలు ఏవైనా గుర్తుకు వచ్చాయి కావచ్చూ.. అందుకే ఆగలేకపోతుంది.. కాగా ఇంతలో ఆ వ్యక్తి అరుపులు విన్న స్దానికులు కాసేపటి తర్వాత స్పందించి ఆ ఎద్దు నుండి బాధితుడిని రక్షించారు. ఇకపోతే ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యి సోషల్ మీడియాలో కాలుపెట్టి వైరల్‌గా మారింది.. ఇక ఈ సీన్ చూసాక అయినా కాస్త జంతువులతో జాగ్రత్తగా ఉండగలరని, అన్ని ఉన్న మనుషులే విచక్షణ కోల్పోతుండగా, పశువులను ఏం అనగలమని సెలవిస్తున్నారు నెటిజన్స్..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: